సీనియర్ నటుడు మోహన్ బాబు కొడుకుల లడాయి తాజాగా భక్తకన్నప్ప సినిమా చుట్టూ తిరుగుతోంది. ఇటీవల భక్తకన్నప్పకు సంబంధించిన విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ హార్డ్ డిస్క్ మాయమైందని, భక్తకన్నప్ప హీరో పాత్రధారి మంచు విష్ణు ఆరోపించిన విషయం తెలిసిందే . ఇప్పుడు తాజాగా ఈ హార్డ్ డిస్క్ మాయం కావడం వెనక తన సోదరుడు మంచు మనోజ్ కి సంబంధించిన ఇద్దరు మనుషుల హస్తం ఉందని ఆరోపించాడు . చెన్నైలో ఓ సమావేశంలో మాట్లాడుతూ మంచు మనోజ్ ఇంట్లో పని చేసే ఓ వ్యక్తి ,మరో మహిళ ఈ హార్డ్ డిస్క్ ను తీసుకుపోయారని అనుమానంగా ఉందని చెప్పారు. అయితే మంచు మనోజ్ చెప్తే వాళ్ళు ఈ పని చేశారా లేదా అన్నది తాను తేల్చుకోవాల్సి ఉందని కూడా వివరించారు.
ఇదిలా ఉండగా దీనికి సంబంధించి పెట్టిన పోలీస్ కేసులో కూడా మంచు విష్ణు చెబుతున్న విషయాలు తికమకగా ఉండడంతో పోలీసులకు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఓవైపు హార్డ్ డిస్క్ పోయిందని చెబుతూనే ,మరోవైపు దాంట్లో కంటెంట్ మొత్తం ఎఫెక్ట్స్ కు సంబంధించిందని దాన్ని 9శాతం ఎవరు ఓపెన్ చేయలేరని ,దానికి పాస్వర్డ్ ఉందని మంచు విష్ణు చెప్తున్నాడు . ఒకవేళ దాంట్లో వివరాలు బయటకు ఎవరైనా లీక్ చేస్తే, దయచేసి చూడవద్దని కూడా కోరుతున్నాడు .
ఇదిలా ఉండగా ఏదో ఒక మిషతో ఈ భక్తకన్నప్ప సినిమాను జనంలో రిలీజ్ కి ముందే ఇలా ప్రచారం చేయడం కూడా ఒక వ్యూహంగా చెబుతున్నారు. మొత్తానికి మంచు విష్ణు, మనోజ్.. ఈ అన్నదమ్ముల వివాదం ఇప్పుడు భక్తకన్నప్ప చుట్టూ తిరుగుతోంది . మనోజ్ కూడా భక్తకన్నప్ప సినిమాపై వ్యంగంగా ఎక్స్ లో కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జూన్ 27వ తేదీన రిలీజ్ గానున్న ఈ సినిమా భవిష్యత్తు ఏమిటో సినిమా రిలీజ్ అయిన రోజే తేలాల్సి ఉంది. అంతవరకూ అన్నదమ్ములిద్దరి ఎంటర్టైన్మెంట్ తప్పదేమో..?

