రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న జగన్ హయాంలో మద్యం కుంభకోణంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారారా..? మొత్తం కేసు పూర్వాపరాలు, విజయసాయిరెడ్డి మాటలు, ట్వీట్స్ పరిశీలిస్తే ఖచ్చితంగా నిజమేననిపిస్తోంది. జగన్ జీవితంలో చిత్రగుప్తుడు లాంటి విజయ్ సాయి రెడ్డి స్వయంగా చేసిన ట్వీట్ లో మద్యం కుంభకోణంలో తన పాత్రలేదని , అయితే దీనిలో సంబంధం ఉన్నవారికి బట్టలు విప్పిస్తానని అనడమే కొసమెరుపు.. ఈ కుంభకోణం మొత్తానికి మొదట్లో ప్లాన్ చేసి నిధులు ఎక్కడ ఎలా దారి మళ్ళించాలో ఏ విధంగా డైవరూట్ చేయాలో సూచనలు ఇచ్చి తప్పుకున్నాడని తెలిసింది. లేదా జగన్ స్వయంగా ఈ వ్యవహారం నుంచి ఆయనను తప్పించి ఉండవచ్చు.
విజయసాయిరెడ్డి మొదట్లో కుంభకోణం చర్చల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ కుంభకోణం మొత్తం వ్యవహారం రాజ్ కసిరెడ్డి , మిదున్ రెడ్డి చేతుల్లోకి పోవడంతో విజయసాయిరెడ్డి దూరం జరిగాడని తెలుస్తోంది. ఇలాంటివన్నీ కూడా అరెస్టై జైల్లో ఉన్న వాసుదేవరెడ్డి , విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారం విచారణ అధికారులు చేదించగలిగారని తెలుస్తోంది. ఎందుకంటే కోటలో రహస్యం ఆ కోటలోని ముఖ్యమైన వ్యక్తి చెబితే తప్ప తెలియనంత పకడ్బందీగా ఈ మద్యం కుంభకోణంలో 3200 కోట్లు చేతులు మారాయి. హవాలా పద్దతిలో అసలు బాస్ కి చేరాయని చెబుతున్నారు.
27 మంది నిందితులుగా ఉన్న కుంభకోణంలో బొంబాయిలో బంగారు దుకాణాల యజమానులు కూడా కేసులో ఉన్నారు. మద్యం కుంభకోణంలో నిధులు బంగారం రూపంలో కూడా మారిపోవడంతో వారు కేసులో ఇరుక్కున్నారు. సిఐడి అధికారుల విచారణ లోతుగా సాగిందని తెలుస్తోంది. దాదాపు 3200 కోట్ల రూపాయలు నగదు రూపంలోనూ, షెల్ కంపెనీ ద్వారా విదేశీ ఖాతాల్లోకి చేరిందని, కొంత బంగారం పెట్టుబడి నుంచి దారి మళ్ళీందని చెప్తున్నారు. అందుకే 27 మంది నిందితుల జాబితాలో మూడు బంగారం దుకాణాలు కూడా నిందితులు ఉన్నారు. రాజ్ కాసిరెడ్డిని ఇందుకోసమే జగన్ ఐటి సలహాదారుగా నియమించుకున్నారు. మద్యం కుంభకోణం లో విజయసాయిరెడ్డి అనధికారకంగానే ఇన్ ఫార్మర్ గా మారారని ఆయనే తన ట్విట్టర్ చేసిన వ్యాఖ్య చెప్పకుండానే చెప్పేసింది.

