వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో జైల్లో ఇబ్బందిపడుతున్న వంశీకి మధ్యంతర బెయిల్ ఇవ్వడమేకాకుండా , మైనింగ్ కేసులో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అనేక కేసులలో నిందితుడుగా ఉన్న వంశీ గత కొన్ని నెలలుగా రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆరోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ ఇచ్చిన కోర్టు , వంశీకి వెంటనే వైద్యం అందించాలని , ఆయుష్ హాస్పిటల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

