మానవాళి, మరియు పశు ,వినాశనానికి పంటల విధ్వంసానికి, చైనా ఓ పెద్ద కుట్ర పన్నిందని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బి ఐ ఆరోపిస్తుంది . ఇందుకు సంబంధించి అమెరికాలో పరిశోధనలు చేస్తున్న చైనాకు సంబంధించిన ఇద్దరు పరిశోధకులను తమ దేశం నుంచి బహిష్కరించింది. యున్ కింగ్ జియాన్ అనే యువతిని , మరియు ఆమె ప్రియుడు జూన్ యోంగ్ అనే ఇద్దరు చైనా పౌరులను కుట్ర, ప్రమాదకరమైన రసాయనిక జీవ ఆయుధాల స్మగ్లింగ్ నేరాలపై చైనాకు పంపించివేసింది. వీరిద్దరూ మానవులు, పంటలు , పశువుల వినాశనానికి ఫుసరిరం గ్రాంనెరియమ్ అనే జీవాయుదాన్ని అమెరికాలో తయారుచేసి దాన్ని వదిలిపెట్టాలని చూసారని ఆరోపణ.
దీనిని పంటలపై తెగుళ్ల నివారణ కోసం వాడుతారు. దీన్ని వాడితే పంటల ఉత్పత్తులు విషపూరితం అవుతాయి. వాటిని తిన్న మనుషులు రోగాల బారిన పడతారు. ఆ పంటల గడ్డితిన్న పశువులు మరణిస్తాయి. ఇలా ఒక క్రమపద్ధతిలో వినాశం సంభవిస్తుంది. దీన్ని పసిగట్టి ఎఫ్ బి ఐ వీరిపై నిఘాపెట్టి గుట్టు రట్టుచేసింది. తప్పుడు వీసాలు ,తప్పుడు పరిశోధక అంశాలతో వీరిద్దరూ అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ పరిశోధనలు చేశారు . ఒక జీవ ఆయుధాన్ని చైనా నుంచి తీసుకొచ్చి దానిపై ఇక్కడ పరిశోధనలు చేసి దాన్ని ఇక్కడ అభివృద్ధి చేసి అమెరికాలోని పౌరుల ప్రాణాలకు పంటలకు హాని చేయాలని తలపెట్టారని ఎఫ్బీఐ ఆరోపించింది. గ్రామినేరియం అనే ఈ జీవాయుదం పర్యావరణ వినాశనానికి కారణమవుతోంది .
దీని కారణంగా దీనికి కారణంగా పంటలకు హెడ్ బైట్ హెడ్లైట్ అనే తెగులు సోకి పంటలు పశువులు, సర్వనాశనమవుతాయి ఆ పంటలు ఉత్పత్తులు వినియోగించిన మానవులు కూడా తీవ్రమైన రోగాల బారిన పడి చనిపోతారు కొన్ని లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరుగుతుంది . ఇది ఒక అమెరికాకే పరిమితంకాకుండా ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరించే ఒక భారీ స్థాయి కుట్ర దీని వెనక దాగి ఉందని అమెరికా ఆరోపిస్తోంది . వీరిద్దరి పరిశోధనకు అవసరమైన నిధులను కూడా చైనా ప్రభుత్వం వీరికి పంపిస్తోంది. చైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ జీవాయుధ రసాయనంపై పరిశోధనలు చేస్తున్నామని దీని ద్వారా అమెరికాకు పెనుముప్పు తలపెట్టాలనుకుంటున్నామని వారిద్దరూ ఎఫ్ బిఐ కి చెప్పారు. ఈ జీవాయద రసాయన పదార్థాన్ని మొదట వీరు డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ ద్వారా అమెరికాలోకి దిగుమతి చేశారు.

