22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

బ్యాంకుల్లో మూలిగే డబ్బులు ఎవరివో..?

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డబ్బులను క్లెయిమ్ చేసుకోమని ఇటీవల కాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వాట్సాప్ లో మెసేజ్ లు వస్తున్నాయి. ఇవి నిజమా ? కాదా ?? అని చాలామంది అనుమాన పడుతున్నారు . ఇటీవల కాలంగా సైబర్ నేరాలు ,ఆన్లైన్ దగాలు ఎక్కువైన సందర్భాల్లో ఈ అనుమానం రావడం సహజం. లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్న జనం వీటిని నమ్ముతున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇలాంటి మెసేజ్ లు అంటేనే భయం పట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ పేరుతో వస్తున్న ఈ మెసేజ్ లో నిజం ఎంత అన్న విషయం ఆలోచిస్తే దానిలో నూటికి నూరు శాతం నిజం ఉంది . అవి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చేవే. ఉద్గామ్ (UDGAM) పోర్టల్ లో వీటిని తీసుకునేందుకు వివరాలు అప్ లోడ్ చేసుకోవచ్చు.పోయిన వారు ,లేదా వదిలేసిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు.

ఇలాంటి డబ్బు బ్యాంకుల్లో 67 వేల కోట్ల రూపాయలు మూలుగుతుంది . ఈ డబ్బంతా అమాయకులైన జనం ఏదో ఒక కారణం మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కొద్దోగొప్పో దాంట్లో నిల్వ ఉన్నప్పుడే దాని సంగతి మరిచిపోయిన జనమే ఎక్కువ . లేదంటే బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారు చనిపోయినప్పుడు వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు కూడా అలాగే వదిలేస్తున్నారు.వీటిని అన్ క్లెయిమ్ డిపాజిట్స్ అంటారు . అక్షరాల 67 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయి . వీటిలో ఎక్కువ భాగం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులులో ఉన్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ప్రజలకు మేలు చేసేందుకు తీసుకోకుండా బ్యాంకుల్లో మిగిలిపోయిన డబ్బులను తీసుకోమని సలహా ఇస్తోంది .

దీనికోసం ఉడ్గామ్ పోర్టల్ ను వాడుకోమని సలహా ఇస్తోంది . ఎవరికైనా బ్యాంక్ అకౌంటు ఉన్న పక్షంలో పేరు ,పాన్ కార్డు ,ఓటర్ ఐడి ,డ్రైవింగ్ లైసెన్స్ ,పాస్పోర్టు లేదా పుట్టినరోజు వీటిలో దేన్నైనా సరే సాక్ష్యంగా చూపించి బ్యాంకులో డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు . లేదంటే ఆ బ్యాంకులకు నేరుగాపోయి డబ్బులు తీసేసుకోవచ్చు . ఈ సందర్భంగా బ్యాంకుల్లోనే కేవైసీ కూడా అప్డేట్ చేసి అకౌంట్ ను లైవ్ లో పెట్టుకోవచ్చు . ఉద్గామ్ పోర్టల్ ఎవరిది అన్న అనుమానం కూడా చాలామందికి వస్తుంది . నూటికి నూరుపాళ్ళు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ .ఇలాంటివాటిని కూడా మోసపూరిత చర్యలకు వాడుకునే కేటుగాళ్లు ఉంటారు. అందువల్ల నెఱుగు బ్యాంకులకు పోయి , లేదా తెలిసిన వారిని దగ్గరపెట్టుకుని క్లెయిమ్ చేసుకోవడం మంచిది. ఇలాంటి వాటికి వచ్చే నకిలీ లింకులు మాత్రం క్లిక్ చెయ్యొద్దు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.