ఢిల్లీ బాంబు పేలుళ్లకు డాక్టర్ ఉమర్ సూత్రధారి మరియు పాత్రధారిగా తేలింది. కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా కోయిల్ అనే గ్రామానికి చెందిన ఉమర్ శ్రీనగర్ లోనే ఎండి పూర్తి చేసి ,ఢిల్లీలో అల్ ఫలహా మెడికల్ కాలేజీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఎర్రకోట దగ్గర జరిగిన ఈ ఆత్మహత్య బాంబు పేలుడులో కారులో ఉన్న శరీర భాగాలతో ఉమర్ తల్లి డిఎన్ఏ సరిపోయింది . దీన్ని బట్టి పేలుడుకు కారణమైన ఐ -20 కారు డ్రైవింగ్ సీట్లో ఉమర్ ఉన్నాడని తేలింది . కారు ఎక్సలేటర్ కు , బ్రేక్ కు మధ్య ఉన్న కాలు భాగాన్ని తీసి దాన్నుంచి డిఎన్ఏ పరీక్షలకు అతడి తల్లి రక్తంతో సరి పోల్చారు . తల్లి డిఎన్ఏ దానితో సరిపోవడంతో ఈ ఆత్మహత్య బాంబు దాడులకు అతడే కారణమని నిర్ధారించారు 33 ఏళ్ల ఉమర్ కు ఇటీవలే వివాహం కూడా అయింది.
బాంబు పేలుళ్లకు ముందు మసీదులోకి పోయివచ్చాడు
బాంబు పేలుళ్లకు ముందు అతడు ఒక లోపలికి పోయి ఆ తర్వాత బయటకు వస్తున్న దృశ్యాలను కూడా సీసీ టీవీలో సేకరించారు. అతని తల్లిని , ముగ్గురు సోదరులను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొస్తున్నారు .ఈ బాంబుదాడి కుట్రలో ఈ కుటుంబం నేపథ్యం ఎంతవరకు అన్నది తేలాల్సి ఉంది. ఉమర్ వదిన కూడా డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె సహకారం , ప్రోద్బలం , ఈ కుట్రలో ఉందని కూడా తేల్చారు . ఈ ఘటనకు ముందు ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన డాక్టర్ ముజమల్ అహ్మద్ వద్ద 358 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి .తాను అద్దెకుంటున్న ఇంట్లో అతడు వీటిని దాచి పెట్టాడు. ఈ డాక్టర్ కూడా చనిపోయిన ఉమర్ పనిచేసే అల్ఫాహా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో పని చేస్తున్నారు . ఉన్నత చదువులు చదివి ఇలా తీవ్రవాదిలా తయారవుతాడని అతనిలో ఇన్ని ఉగ్రవాద భావాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయామని హాస్పిటల్ లో ఉమర్ సహచరులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

