దేవుడికి పెట్టే ప్రసాదం కోసం రెండు కోతులు ఎక్కడ తిరిగినా , ఒక సమయంలో వచ్చి తీరిగ్గా తినేసిపోతాయి. ఇదేదో గుడిలో జరిగే తంతు కాదు.. నెల్లూరు ట్రంక్ రోడ్డులోని మాధవయ్య ఫర్నిచర్ దుకాణంలో జరిగే వింత.. గత కొన్నేళ్లుగా ఇది జరిగిపోతొంది. ఉదయం పూజ చేసి దేవుడు పటాలముందు పెట్టిన అరటిపండ్లు, ఇతర పళ్ళు , ఫలహారాలను రెండు కోతులు మధ్యాహ్నం ఒంటి గంటనుంచి నాలుగు గంటల లోపు ఆ రెండు కోతులు వచ్చి , దేని వాటా అది తినేసి వెళ్లిపోతాయి. వాటికోసమే ఆ ప్రసాదాలను దుకాణం యజమానులు దేవుడు పటాలముందు ఉంచేస్తారు.. నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉండే ఆ దుకాణంలో ఆ రెండు కోతులు , రద్దీ లేని సమయాన్నే ఎంచుకుని రావడం కూడా విశేషమే.. దేవుడు పటాలముందు ప్రసాదంకోసం వచ్చే ఆ కోతులు చాలా తీరిగ్గా ప్రసాదం ఆరగించి .తమ పనేదో తాము పూర్తిచేసుకున్నట్టు బుద్దిగా వెళ్లిపోతాయి..

