22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఇరాన్ సర్వ నాశనమే మా లక్ష్యం

ఇరాన్‌ ను సైనిక, ఆయుధ పరంగా సర్వనాశనం చేసేదాకా యుద్ధం ఆగదని అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ట్రయిల్ పార్ట్ మాత్రమే చూసారు, అసలు సినిమా ముందుంది అంటూ వ్యాఖ్యానించింది. రష్యా, చైనా యుద్ధంఆపేయాలని చేసిన సూచనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమెరికా కరాఖండిగా చెప్పింది. ఇరాన్ లో ఇప్పటికే 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు చెప్పారు. ఈ యుద్ధం పూర్తిగా టెహ్రాన్ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని, ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేసింది.

ఈ విషయంలో బీజింగ్ లేదా మాస్కోతో తాము చర్చించడం లేదని, ప్రస్తుత ఘర్షణలో వారి ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. “వారికి నేనిచ్చే సందేశం ఏమీ లేదు.. ఈ విషయంలో వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు” అని అమెరికా యుద్ధ వ్యవహారాల కార్యదర్శి హెగ్సెత్ వ్యాఖ్యానించారు. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి ప్రయోగాలు 86 శాతం తగ్గాయని వివరించారు.. అణు కార్యక్రమంపై ఇరాన్ నిజాయతీగా చర్చలు జరపడం లేదని తమ నిఘా వర్గాలు నిర్ధారించుకున్న తర్వాతే ఈ సైనిక చర్య ప్రారంభించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.

ఇరాన్ వద్ద తమపైకి ఎక్కుపెట్టిన వేలాది క్షిపణులు ఉన్నాయని హెగ్సెత్ ఆరోపించారు. ఈ ఆపరేషన్ లక్ష్యం ఇరాన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమేనని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులనుంచి రక్షణ కోసం సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి మధ్యప్రాచ్య దేశాలు సహాయం అందిస్తున్నాయని పెంటగాన్ వెల్లడించింది. అయితే, ఈ యుద్ధంలో ప్రాథమికంగా పైచేయి సాధించినప్పటికీ, ఇది ఇంకా తొలిదశలోనే ఉందని అమెరికా అధికారులు స్పష్టం చేసారు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.