తల్లి ప్రేమ అనంతం. సకల దేవతల స్వరూపం తల్లి మాత్రమే.. తల్లినిమించిన దైవం లేదు. .బిడ్డల పట్ల తల్లి ప్రేమ సహజం కానీ ఆ బిడ్డల ప్రేమకు నోచుకున్న తల్లులు నిజంగా ధన్యులు. .పూర్వజన్మ పుణ్యఫలం వల్లనే తల్లిని పూజించే బిడ్డలు కలుగుతారు.అలాంటి బిడ్డలు ఇప్పుడు అరుదుగానే కనిపిస్తారు . ఇదిగో ఈ మూగ చెవిటి కొడుకును చూడండి. ప్రతిరోజు తల్లి సమాధి దగ్గరకు వచ్చి తల్లితో తన మూగ భాషలో సైగలు చేసి మాట్లాడి, పూలు పెట్టి ,. దండం పెట్టుకొని పోతుంటాడు. మాటలు రాని కొడుకు సైగల ద్వారానే సమాధిలో ఉన్న ఆ తల్లితో మాట్లాడుతుంటాడు.
మలేషియాలో ప్రతి ఒక్కరిని, బహుశా ప్రపంచాన్ని ,మానవత్వం ఉన్న వాళ్ళని, మాతృత్వం ప్రేమ తెలిసిన వాళ్ళని కదిలించి కన్నీరు పెట్టిస్తున్న సంఘటన ఇది.. ఇతడి పేరు హఫీజ్. తల్లి పేరు సనావతి.. గత ఏడాది ఆగస్టులో గర్భాశయ క్యాన్సర్ వల్ల చనిపోయింది.. తల్లిని సమాధి చేసిన రోజు నుంచి ప్రతిరోజు తల్లి సమాధి వద్దకు వచ్చి ఆరోజు తను చేసిన పనులన్నింటినీ చెప్పుకుంటాడు ఈ మూగ కొడుకు. కాసేపు కన్నీరుగార్చి పోతుంటాడు.
గత ఏడాది ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు వాతావరణం ఎలాంటిదైనా సరే తప్పకుండా తల్లి సమాధిని దర్శించుకుని తన రోజువారి కార్యక్రమాలను తల్లికి సైగల చెప్పుకొని పోతుంటాడు. ఇలాంటి కొడుకులు నూటికి కాదు కోటికి ఒక్కడుంటాడు . సమాధిలో కూడా తల్లిని దైవం కంటే మిన్నగా ప్రేమించే కొడుకుల్ని ,తల్లే సర్వసంగా బ్రతికే కొడుకులను కన్న ఆ తల్లి అదృష్టవంతురాలు.
తల్లి లేకపోయినా ఆ తల్లిని గుండెల్లో నింపుకొని కళ్ళ ముందు సాక్షాత్కరించుకుని మాటలు రాకపోయినా ఇలా సైగల ద్వారా తల్లి సమాధి తో మాట్లాడే కొడుకులను ఎక్కడైనా చూస్తామా ? ఇలాంటి బిడ్డను కన్న గతించిన ఆ తల్లి ఎంత పుణ్యాత్మురాలు ..? నిజంగా కొడుకులకు తల్లి అసలు స్వరూపాన్ని సాక్షాత్కరించిన ఆ కొడుకు ధన్యుడు.. అతడి జీవితం ధన్యం.

