22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

ట్రావెల్స్ బస్సుల్లో అధికారుల లాలూచీ

కర్నూల్ లో హైదరాబాదు, బెంగుళూరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దహనం తర్వాత, మారణకాండ ముగిసిపోయి, కర్మ కాండలు కూడా పూర్తైన తరువాత ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మేలుకున్నాయి. అధికారుల్లో కూడా కొత్తగా చలనం వచ్చినట్టు తనిఖీలు మొదలుపెట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇష్టారాజ్యంగా ఉందన్న విషయం ఈనాటిది కాదు. అది అందరికీ తెలిసిన సత్యమే. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చెప్పిందే వేదం ..వాళ్ళు చెప్పిందే శాసనం.. బస్సుల ఫిట్నెస్లు, బస్సుల్లో సౌకర్యాలు, బస్సుల వేగం, డ్రైవర్ల అర్హతలు ఇవన్నీ కూడా ఎవరికివారుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారే నిర్దేశించుకున్నవే. అధికారులకు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు లాలూచీ అన్నది బహిరంగ సత్యం. ఇప్పుడు అంతా కర్మకాండలు పూర్తయిన తర్వాత ఇప్పుడు తనిఖీలు పేరుతో అధికారులు నాటకాలు చేస్తున్నారు.

తనిఖీలపేరుతో రవాణా శాఖ నాటకం..

బస్సులను తనిఖీ చేయడం మొదలు పెడుతున్నారు. మామూళ్లు ఇచ్చే బస్సులను తనిఖీ చేయడం అనేది దాదాపుగా మరిచిపోయారు. ఇప్పటికి ఎన్నో దఫాలు బస్సు ప్రమాదాలు, బస్సులు ఢీకొనడం, బస్సుల్లో అగ్ని ప్రమాదాలు,.. ఇవన్నీ జరుగుతూనే ఉన్న ప్రతి ప్రమాదం తర్వాత ఇలాంటి నాటకాలు మామూలే. అదే నాటకం ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లో జరుగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు రాజకీయంగాను, సామాజికంగానూ, ఆర్థికంగానూ బలపడిన వర్గాలు. అధికారులు ఎప్పటికప్పుడు వారి కనుసన్నల్లో మెలుగుతుంటారు. అందువల్ల ఏనాడూ కూడా చార్జీల నియంత్రణ, బస్సుల నాణ్యత, యాంత్రికంగా ఆ బస్సుల పనితీరు, ఇవి ఫిట్నెస్ కు పోకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.

బస్సుల్లో ఎక్కువభాగం ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు

రవాణా శాఖ అధికారుల తనిఖీలు ఇప్పుడు కొత్త కాదు. ప్రతి ప్రమాదం తర్వాత జరుగుతున్న తూతూ మంత్రంగా జరిగే తంతు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రజల ప్రాణాలు, భద్రతా ప్రమాణాలు, దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠినమైన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ఎక్కువగా నాగాలాండ్ ,ఒరిస్సా, పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చుకొని , కనీసం వాటిని ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకుండా తిప్పుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పట్టించుకునే వారే లేరు. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని నియంత్రించి ప్రైవేట్ ట్రావెల్స్ రాజ్యానికి కళ్లెం వేసి, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలకు అనుగుణంగా, డ్రైవర్లు కూడా అర్హతలు అనుగుణంగా ,మార్గదర్శకాలు రూపొందించి పనిచేస్తే తప్ప ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు ఆగవు.. అధికారులు నిజాయితీగా ఉంటేనే ఇవి పనిచేస్తాయి.. లేదంటే మళ్ళీ షరా మామూలే.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.