22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ట్రాన్స్ జెండర్ జెన్సీ ఇక ప్రొఫెసర్ జెన్సీ.

చెన్నైలో ప్రతిష్టాత్మక లయోలా కాలేజ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా డాక్టర్ ఎన్ జెన్సీ ఉద్యోగంలో చేరింది. ఇదేదో సాధారణ విషయం కాదు . ఎందుకంటే జెన్సి ఆడా కాదు ,మగా కాదు . ఆమె ట్రాన్స్ జెండర్ . హిజ్రాల జాతి నుంచి ఈ దేశంలో మొట్టమొదట అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి , పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ధైర్యంగా సగర్వంగా తరగతి గదిలోకి ప్రవేశించింది డాక్టర్ జయంతి చెన్నైలోని లయోలా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పోటీ పరీక్షలలో ఎంపికైంది.

హిజ్రాలు అంటే సమాజంలో చులకన ,తిరస్కారం, అవమానం , అవహేళనలు మధ్య అన్ని ప్రతిబంధకాలని, అడ్డంకులను ఆటుపోట్లను తట్టుకొని,ఎదిరించి నిలబడి ధైర్యంగా విధిని ధిక్కరించి తన సమాజంలో స్థానం ఏమిటో జెన్సీ నిరూపించుకుంది. దేశంలో హిజ్రాలకు ఒక ఆదర్శంగా నిలిచింది. తలెత్తుకుని తిరగమని తన జాతిని సంభోదిస్తుంది .ఉపదేశిస్తుంది . డాక్టర్ జెన్సీ తిరుత్తణిలో పుట్టింది . చిన్ననాటి నుంచి ఆమె తన శరీర నిర్మాణంలో మార్పులను గమనించింది. తనలో తనకు తెలియని మరో వ్యక్తి ఉన్నాడని అర్థం చేసుకుంది . అయినా విధిని ఎదిరించి చదువు ద్వారానే తనను తాను నిరూపించుకొని ఈ సమాజంలో ఒక గౌరవ స్థానంలో నిలబడింది.

విద్య తనను మనిషిని చేస్తుందని విద్య తనను గౌరవ స్థానంలో నిలబెడుతుందని భావించి ఆ దిశగానే అడుగులు వేసి నిరూపించుకుంది . ,ఇది తన విజయం కాదని తన ట్రాన్స్ జెండర్ సమాజం సాధించిన విజయమని తన విజయం వాళ్లందరికీ ఒక స్ఫూర్తిని, ఒక మార్గాన్ని ఉపదేశిస్తుందని సమాజంలో గౌరవంగా బ్రతికే ఆలోచన కలగజేస్తుందని జెన్సీ చెప్తోంది . జెన్సి డిగ్రీలోనూ ,పీజీలోనూ గోల్డ్ మెడల్ సాధించింది. పిహెచ్డి కూడాదక్కించుకుంది.. ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చెన్నై లయోలా కాలేజీలో తలఎత్తుకుని సగర్వంగా ప్రవేశించింది. హిజ్రాలు సమాజానికి భయపడి పారిపోవద్దని, సమాజంనుంచి దూరం కావద్దని , అవమానాలకు కృంగిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సాటి హిజ్రాలకు జెన్సీ ఉపదేశిస్తుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.