22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

రైలు బోగీల్లో బీహార్ దొంగల గ్యాంగులు.జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైళ్లలో చోరీలకు మళ్ళీ పొరుగు రాష్ట్రాల గ్యాంగులు వచ్చి పడ్డాయి. రైల్వే చోరీల్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతూ దోపిడీలు చేసే మహారాష్ట్ర,బీహార్ గ్యాంగ్.లు బీభత్సం సృష్టిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న ఈ గ్యాంగులను అదుపుచేసేందుకు పోలీసులు గట్టిగానే ఎదుర్కుంటున్నారు. అర్థరాత్రి రైళ్లులో చొరబడి దొంగతనాలు చేస్తున్న మహారాష్ట్ర, బీహార్ ముఠా ఆగడాలు గతంలో ఎక్కువగా ఉండేవి. తాజాగా నిన్నటిరోజున అర్ధరాత్రి పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్ లో చోరీకి ఈ గ్యాంగులు ప్రయత్నం చేసాయి.

దొంగలను చూసి రైల్వే పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో వెనక్కితగ్గిన్ దొంగలు కాల్పుల ధాటికి రైలు దిగి చీకట్లో పారిపోయారు. గతంలో మాదిరిగా వరుసగా రైళ్ళలో చోరికి పాల్పడుతున్న బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్ లు ఆటకట్టించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రైలు ప్రయాణాల్లో గమ్యం చేరేవరకు భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు గుర్తించిన పోలీసులు వారికోసం వేట సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే వారంరోజుల్లో రెండు సార్లు చోరి చేసేందుకు వచ్చిన ఈ ముఠా ప్రయత్నం చేసింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.