22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ట్రాఫిక్ పోలీస్ వాహనాలకు రూల్స్ లేవా.?

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడితే ఎలాగుంటుందో ఇది కూడా అంటే.. ఏ వాహనం కనపడ్డా , లేదా పార్కిల్న్గ్ కానీ ప్రదేశంలో ఒక్క సెకండ్ ఆపినా లేదా టార్గెట్ పూర్తికాకపోయినా ట్రాఫిక్ పోలీసులు చలానాలు కొట్టేస్తారు. మొబైల్ లో ఫొటోలు తీసి అప్ లోడ్ చేసేస్తారు. అంటే చలనామీదా చలానా కట్టాల్సిందే.. మనమేమీ చేయాలేం.. చట్టం తన పనితాను చేసుకుపోతుంది. అయితే పోలీసు వాహనాలు ట్రాఫిక్ రూల్స్ ప్రకారమే పోతాయా..?

పోలీసులు రూల్ ప్రకారమే ట్రాఫిక్ లో తమ వాహనాలను పెడతారా..? ట్రాఫిక్ పోలీసులూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పోవడం రాజధర్మం అనుకుంటారు. అయితే మూడో కన్ను అనేది ఒకటి ఉంటుందికదా ..? అది తనపని తానూ చేసుకుపోతుంది. పోలీసు వాహనాలూ చట్టం ఉల్లంఘించి, ట్రాఫిక్ రూల్స్ ని అధిగమిస్తే , ఆటోమాటిక్ గా చలానా రికార్డ్ అవుతుంది. అందుకే పాపం..

తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల వాహనాలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద చలానాలు కింద కట్టాల్సిన ఫైన్ ఎంతో తెలుసా..? అక్షరాలా 68 లక్షల 67 వేల రూపాయలు. . తెలంగాణ పోలీస్ వాహనాలు 17, 391 చలానాల్లో ఈ మొత్తం ఉంది. అంటే మనకు పాఠాలు చెప్పే ట్రాఫిక్ పోలీసులే , ట్రాఫిక్ ని ఉల్లంఘించడంలో ఘనాతి ఘనులు అన్నమాట..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.