భూమి మీద మనకు తెలియని వింతలెన్నో, తెలియకుండానే జరిగిపోతుంటాయి. అలాంటిదే జూన్ 21 తేదీ , శనివారం. ఇలాంటి రోజు ఏడాదికి ఒక్కసారే వస్తుంది. అదే దీని విశేషం. ఈ రోజులో పగలు సమయం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది. డిసెంబర్ 22 న తక్కువ పగలు, రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. భూమికి ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఎక్కువ దేశాలలో ఇలా జరుగుతుంది.
భూమి సూర్యుడి వైపునకు కొద్దిగా వంగడంవల్ల ఈ ఖగోళ అద్భుతం జరుగుతుంది. కర్కాటక రేఖ అనేది భూమిపై ఒక ఊహాత్మక రేఖ, ఇది భూమధ్యరేఖకు ఉత్తర భాగంలో 23.4394 డిగ్రీల వద్ద ఉంటుంది .ఈ రేఖ వద్ద, ఒకసారి సూర్యుడు ఆకాశంలో అత్యంత ఎత్తుకు వస్తాడు, సాధారణంగా జూన్ 21 లేదా 22 తేదీలలో ఇది జరుగుతుంది.
భారతదేశంలో:కర్కాటక రేఖ దేశంలోని ఎనిమిది రాష్ట్రాల గుండా వెళుతుంది: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మరియు మిజోరం రాష్ట్రాల నుంచి పోతుంది కాబట్టి శనివారం ఇక్క పగలు ఎక్కువ , రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది.

