ఈనెల 27న జగన్ తిరుమల పర్యటనపై మళ్ళీ ఆసక్తి నెలకొనింది. చర్చ జరుగుతొంది. తిరుమల పర్యటన లో ప్రతి పక్షంలో ను, ముఖ్యమంత్రి హోదాలో వున్నా ఎప్పుడూ హిందూమతంపై విశ్వాసం ఉందని డెక్లరేషన్ పైసంతకం పెట్టని జగన్ ఇప్పుడు కూడా అలాగే శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తాడా లేక సంతకం చేసి దర్శనానికి పోతాడా అనేది ఇప్పుడు ప్రశ్న , డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయకుండా మళ్ళీ దీన్ని రాజకీయ వివాదం చేస్తాడా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. డెక్లరేషన్ పై సంతకం లేకుండా జగన్ ను దర్శనానికి అనుమతించబోమంటున్న టిటిడి వైఖరి సడలించేట్టు కనపడటంలేదు.
టిటిడి నియమనిబంధనలు ప్రకారం జగన్ సంతకం చేయాల్సిందే అంటున్న టిటిడి అధికారులు , ఎప్పుడైనా ఎంత పెద్ద విఐపి అయినా ఈ నిబంధనలు పాటించిన వారేనని చెబుతొంది. జగన్ ఒక్కడే సంతకం పెట్టకుండా , సీఎంగా దర్శనానికి వచ్చారని చెబుతున్నారు. జగన్ హిందూ మాటస్తుడు కాదని , అన్యమతస్తుడు కావడంతో నే డెక్లరేషన్ ఇవ్వాలని టిటిడి షరతుపెట్టింది. ఇది 70 ఏళ్లుగా ఉన్న ఆలయ సంప్రదాయమని చెప్పింది. కేరళ, ఉత్తరాదిలో కొన్ని ఆలయాల్లో అసలు లోపలకుకూడా రానివ్వరని గుర్తుచేసింది. టిటిడి నియమనిబంధనలు అన్యమతస్తులు ఎవ్వరైనా సరే సంతకం చేయాల్సిందేనాని స్పష్టం చేసింది.
తన రాజకీయ ప్రచారానికి జగన్ తిరుమల ను టార్గెట్ గా చేసుకున్నారని టిడిపి ఆరోపిస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా చిన్న సంఘటనలను భూతద్దం లో చూపించే విధంగా సొంత మీడియాలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం.చేస్తున్నారని అంటున్నారు. జగన్ భారతీ తోపాటు దర్శనానికి వస్తారా..? ఆలయంలో ప్రసాదాలు స్వీకరిస్తారా ..? అని నిలదీశారు. గతంలో సీఎంగా రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసిన తర్వాత అక్షింతలు తలపై దులిపేసుకున్న జగన్ విడియో అప్పట్లో వైరల్ అయిందని టిడిపి నేతలు గుర్తుచేస్తున్నారు. శ్రీవారి ఆలయం లో తులాభారం వద్ద వైవి సుబ్బా రెడ్డి భార్య గతంలో జగన్ పర్యటన లో జగన్ రక్షక గోవిందా అంటూ నినాదాలు ఈ నినాదాలపై పెను దుమారం రేగిందని అంటున్నారు.

