సృష్టి చాలా విచిత్రమైనది. అంటే కాదు అద్భుతమైంది కూడా. కొన్ని జీవరాశుల మర్మం తెలిస్తే ఇదికదా సృష్టి రహస్యం అని నోరు వెళ్ళబెట్టాల్సిందే.. మన చిటికెన వేలి గోరు సైజులో ఉండే డేనియో నెల్లా సెర్బ్రిం అనే చేప సృష్టి అద్భుతానికి నిదర్శనం. ఈ చేప మయన్మార్ దేశంలోని మంచినీటి సరస్సుల్లో , చెరువుల్లో , నదుల్లో ఉంటుంది.
దీని విశేషం ఏమిటంటే ఇంత చిన్న చేప అరిస్తే, ఏనుగు ఘీంకరించనట్టు, అంబులెన్స్ సైరెన్ పెద్దగా మోగుతున్నట్టు ఉంటుంది. ఇది ఉండే నీళ్ళలోనుంచి అలాంటి శబ్దం వస్తుంది. చిటికిన వేలు గోరంత లేని ఈ చేపకు ఇంత శక్తి ఎలా వస్తుందో అని శాస్త్రవేత్తలు పరిశోధన చేసారు. దీని నుంచి వచ్చే సౌండ్ 140 డెసిబుల్స్ ఉంటుంది. ఈ బుల్లిచేప పారదర్శకంగా గాజులాగా ఉంటుంది.

