దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో ,ఆ ప్రదేశాల ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ,పవిత్రతను తెలియచేసేందుకు టూరిస్ట్ గైడ్లు ఉంటారు. అయితే పాకిస్తాన్ తీవ్రవాదులు కూడా కాశ్మీర్లో దారులు చూపించేందుకు,దాడులకు అనువైన ప్రాంతాలలో చూపించేందుకు, దాడులు చేసేయి తప్పించుకుపోయేందుకు కూడా గైడ్లు ఉంటారన్న విషయం ఇప్పటివరకు మనకు తెలియదు. కానీ ఇది నిజం. పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ జాతీయులు మరియు కాశ్మీర్లో తీవ్రవాదులకు అనుకూలంగా గైడ్లు ముసుగులో కొందరు యువకులు పాక్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని తాజా సంఘటనతో బట్టబయలు అయింది .
రెండు దేశాలమధ్య వాస్తవాధీన రేఖ వెంబడి టూరిస్ట్ గైడ్ ముసుగులో తీవ్రవాదులకు సహకరిస్తున్న ఓ పాకిస్తాన్ జాతీయుణ్ణి అరెస్టు భద్రతా దళం అరెస్ట్ చేసింది. మహమ్మద్ ఆరిఫ్ అహమద్ అనే ఈ వ్యక్తి భారత దేశంలో చొరబడి టూరిస్ట్ గైడ్ ముసుగులో సరిహద్దు రేఖ వెంబడి తీవ్రవాదులను భారత దేశంలో తీసుకొచ్చి కాశ్మిర్ లో ఆశ్రయం ఏర్పాటు చేసి ,దాడులకు అనువైన ప్రాంతాలను చూపిస్తుంటారు. ఇతడు జైషే ఇ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ తరపున వ్యక్తి అని తేలింది .
ఇటీవల నలుగురు జైషే మహమ్మద్ తీవ్రవాదులను పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్ సరిహద్దులమీదుగా దాటించి ఇతడు తీసుకుపోతుండగా భద్రతా దళాలు గుర్తించి ఉగ్రవాదుల్లో ఇద్దరిని కాల్చి చంపేశారు.టూరిస్ట్ గైడ్ ముసుగులో ఉన్న మహమ్మద్ ఆరిఫ్ అహమద్ ని అదుపులోకి తీసుకున్నారు . కాశ్మీర్ లో టూరిస్ట్ గైడ్లు పూర్వాపరాలపై పోలీసులు ఇప్పుడు దృష్టిపెట్టారు..

