22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

అడవిలో ఈ పుట్ట ఎందుకు తవ్వుతున్నారో తెలుసా..?

గిరిజనులు అడవిలో ఈ పుట్ట ఎందుకు తవ్వుతున్నారో తెలుసా..? పలు అంతస్తులుగా ఉన్న ఈ పుట్టలో ఏముంటుందో తెలుసా..? పుట్ట నిర్మాణం ఎంత సాంకేతికతతో ఉందొ చూడండి. పురాతనకాలంలో రాజభవనాలు మాదిరి ఉంది. బయట ఎంత ఎండ ఉన్నా లోపల చల్లగా ఉంటుంది. ఎంత వాన కురిసినా నీళ్లు బయటకు డ్రైన్ అయ్యేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అత్యంత సురక్షితమైన ఈ పుట్ట కోట చెదలు పెట్టిన కోట.. దీనిలో అత్యంత జాగ్రత్తగా గిరిజనులు తవ్వితీసే మట్టి ఉండలు ఏమిటో తెలుసా..? అవి చెదలు గుడ్లు, పిల్లలు, ఒక గుండ్రని రాయిలాగా తయారై పెద్దవి అయ్యేందుకు ప్రకృతి నేర్పిన అద్భుత జీవన విధానం..

ఇవి తింటే కోళ్లు , బలిష్టంగా ఉంటాయి.

ఈ గుండ్రటి ఉండలు , కోళ్లకు మేతగా వేస్తారు. ఇవి తింటే కోళ్లు , బలిష్టంగా ఉంటాయి. ఇది కోళ్లకు మంచి పౌష్టిక ఆహారం . ఇంతకీ చెదలు ఈ పుట్టలు పెట్టేవిధానం ప్రకృతి అద్భుతాలలో ఒకటి. ఇది కూడా సృష్టి విచిత్రమే.. మొదటగా రెక్కలున్న రాణి చెదలు పుట్టపెట్టేందుకు , మగ చెదలు తోడుతో వస్తుంది. సరైన భూమిని ఎంపికచేసుకుని అక్కడ తిష్ట వేస్తాయి. పుట్ట పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన తరువాత అక్కడే రాణి చెదలు రెక్కలు వదిలేస్తుంది. మగ చెదలుతో కలిసి , చిన్న గుంత చేసి దానిలోకి ఆడా , మగా చెదలు పోయి, గుంతను మూసేసి సంతానోత్పత్తి చేస్తాయి.

ఇదీ ప్రకృతి అద్భుతం.. అంతుబట్టని సృష్టి రహస్యం.

గుడ్లు పెట్టేకొద్దీ పుట్టను పెద్దదిగా చేస్తూ పోతాయి. కొత్త గుడ్లుకు వీలుగా , మట్టి కోటలో గదులు లాంటి అరలు కడుతాయి. దీనికి మిగిలిన చెదలు కూడా సహకరిస్తాయి. రాణి చెదలు ప్రతి రోజూ వందలకొద్దీ గుడ్లు పెడుతుంది. వాటినుంచి మళ్ళీ వందలకొద్దీ చెదలు..వాటికోసం మళ్ళీ పుట్టలో గదులు.. ఇలా ఈ జీవ పరిణామం సాగిపోతూనే ఉంటుంది.. పుట్టలో స్థలం అయిపోయిన తరువాత పెద్దయిన రాణి చెదలు మళ్ళీ మరో స్థలాన్ని ఎంపికచేసుని అక్కడకూడా ఇలాగే పుట్టలు పెడుతుంటాయి. ఇదీ ప్రకృతి అద్భుతం.. అంతుబట్టని సృష్టి రహస్యం.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.