నెల్లూరులో అమాయక గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి కోట్లు కొట్టేసిన మాయగాళ్ళు. యాక్సిస్ బ్యాంక్ నుంచి 10 కోట్లకు పైగా లోన్లు పేరుతో డబ్బులు కాజేసి పత్తాలేకుండా పారిపోయారు. దీనిలో బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి.గిరిజనులకు సాఫ్ట్వేర్ మేకప్ వేసి, బ్యాంకు సిబ్బంది జాయింట్ ఆపరేషన్ తో కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లులో జర్నలిస్టు ముసుగేసుకున్న మోసగాళ్ళు, సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు.
యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా 10 కోట్ల 60 లక్షల మేర స్కామ్ చేసిన కేటుగాళ్ళు అమాయక గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి సుమారు 56 మంది పేర్లతో ల అప్పు తీసుకుని గుడారం ఎత్తేశారు. దీనికోసం ఫేక్ కంపెనీలు కూడా ఏర్పాటు చేశారు. గిరిజనులను అందులో ఎంప్లాయిస్ గా రికార్డ్స్ క్రియేట్ చేసి వాళ్ల పేర్లు పై లోన్లు తీసుకున్నారు. ఫేక్ కంపెనీ నుంచి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు.
2022 -2024 సంవత్సరాల మధ్య జరిగిన ఈ భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ పంపిన నోటీసులపై గిరిజనులు అవాక్కయ్యారు. సంతకం కూడా రాని తమను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి లోన్లు తీసుకున్న వారెవరూ వీళ్లకు తెలియదు. బ్యాంక్ నోటీసులపై గిరిజనులుతమ నాయకుడు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మోసంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో జాలే వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ తో పాటు మరో ఆరుగురు మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ భారీ స్కాం లో బ్యాంకు ఉద్యోగుల పాత్ర పై బలమైనఅనుమానాలు ఉన్నాయి.

