తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలోనే టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలకు ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్ జిల్లాను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. 60 ఏం ఎల్ నుంచి 180 ఎంఎల్ వరకు టెట్రా పాక్స్ లోనే అమ్ముతారని చెబుతున్నారు.
ఇప్పటికే ఈ పధకం కర్ణాటకలో అమల్లో ఉంది. ఇందుకు సంబంధించి మేక్ డోవెల్ కంపెనీ టెట్రా పాకెట్స్ లో మద్యం సరఫరాకు ముందుకొచ్చింది. తెలంగాణ ఎక్సయిజ్ అధికారులతో కూడా చర్చలు జరిపింది. టెట్రా పాక్స్ లో అమ్మకాలు జరిపితే , మద్యం ధర కూడా 20 రూపాయలవరకు తగ్గే అవకాశం ఉంది..

