సిబిఐ కేసులు భయం జగన్ ను ఎంత వెంటాడుతుందో మళ్లీ మరో సంఘటన నిరూపిస్తుంది . ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థికే ఓటేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు కూడా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సంప్రదింపులు జరిపి వచ్చారు . జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాని ,అంతకు ముందు కానీ ,ఆ తర్వాత గాని ఏనాడు బిజెపిని వ్యతిరేకించే ప్రయత్నం చేయలేదు . తమ పార్టీ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పడమే తప్ప ఏ రోజు కూడా బిజెపి ఆదేశాలను బేఖాతరు చేసిన రోజు కూడా లేదు. బిజెపి ఆదేశాలను శిరసా వహించి పాటించిన సందర్భమే ఉంది.
ఐదేళ్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మోడీకి అత్యంత సన్నిహితుడుగా, ఇష్టుడైన బిడ్డగా, పేరుపొందారు ఇప్పటికీ ఆయన అదే పందాలు కొనసాగుతున్నారు కేంద్రంలో సిబిఐ చేతుల్లో ఉన్న కేసులు కోసం జగన్ రాజీ పడ్డారు ఉన్నాడన్నది నగ్నసత్యం . దీనిలో ఎలాంటి అనుమానం లేదు . మంగళవారం ఉదయం బీజేపీ ఎంపీలు కేంద్రమంత్రిని కలిసి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పేసారు. ఇందుకోసమే ఎంపీ మిదున్ రెడ్డి కూడా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. బెయిల్ తీసుకొని వైసీపీ ఎంపీ కేవలం బీజేపీ అభ్యర్థికి ఓటేసి అందుకే వచ్చారంటే దీన్నిబట్టి కేంద్రంలో మోడీ చేతుల్లో కీలుబొమ్మలాట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక చేత్తో చంద్రబాబు నాయుడుని , మరో చేత్తో జగన్ ని ఆడిస్తూ మోడీ రసవత్తర నాటకాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత సురక్షితమైన రాజకీయ భద్రత బిజెపికి ఇంకెక్కడ లేదు . దక్షిణ భారతదేశంలో తమిళనాడు ,తెలంగాణ ,కర్ణాటక , కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో బిజెపికి బిజెపిని వ్యతిరేకించే బలమైన పక్షాలు ఉన్నాయి . కానీ ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే అధికారపక్షం ,ప్రతిపక్షం రెండూ కూడా ప్రధానమంత్రి మోడీకి దాసోహం అంటున్నాయి. బిజెపికి ఊడిగం చేసే పనిలోనే తెలుగుదేశం పార్టీ , వైసిపి మునిగితేలుతున్నాయి. ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవు . అన్న సామెత ఆంధ్రప్రదేశ్ విషయంలో సరిపోదు. ఆంధ్రప్రదేశ్లో పరస్పరం కత్తులు దూసి పోరాడుకుంటున్న తెలుగుదేశం పార్టీ, వైసిపి రెండో కూడా మోడీ ఒరలోనే ఉండిపోయాయి . దీన్నిబట్టి మన రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల దివాలా దివాలా కోరు రాజకీయం ఎంత దయనీయమైందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

