బిగ్ బాస్ షోలో పాల్గొనడం పై ప్రముఖ బాలీవుడ్ నటి తను శ్రీ దత్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి . అసలు బిగ్ బాస్ షో పవిత్రతని లేదా బిగ్ బాస్ షో నడిచే తీరు ఎలాంటిదో అన్న అనుమానానికి ఆస్కారం కలిగించాయి. బిగ్ బాస్ షో పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి . అయితే ఈ షో హోస్ట్ లుగా గా ప్రముఖ హీరోలను ,హీరోయిన్ పెడుతుండడంతో టీవీ చానల్స్ లో దీని ద్వారా డబ్బు సంపాదనకు ఒక మార్గం వేశారు . అమితాబచ్చన్ , సల్మాన్ ఖాన్ , సంజయ్ దత్ , శిల్పాశెట్టి, జూనియర్ ఎన్టీఆర్ , నాగార్జున అర్షద్ వర్లి లాంటి క్రేజీ హీరోలు కూడా ఈ బిగ్ బాస్ షో హౌస్ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు .
అయితే బిగ్ బాస్ షో నైతిక విలువలు లేని కార్యక్రమం అని తను శ్రీ దత్త స్పష్టంగా చెప్పేశారు. ఆ షో అంటేనే తనకు అసహ్యమని , అదొక బూతు షో అని అన్నారు. తనను బిగ్ బాస్ షోకు ఆహ్వానించారని, ఒక కోటి 65 లక్షలు రూపాయలు కూడా ఆఫర్ చేశారని తనుశ్రీ దత్త చెప్పింది . దీన్ని తాను తిరస్కరించానని కూడా పేర్కొంది . ఇలాంటి చీప్ షోలో తాను పాల్గొని ని తన వ్యక్తిత్వాన్ని ,నైతికతను దిగజార్చుకోలేనని చెప్పింది . బిగ్ బాస్ షోలో అందరితో కలిసి పడుకోవడం, అందరితో కలిసి పడక పంచుకోవడం ఇలాంటివన్నీ తనకి అసహ్యమని ,ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటైన అంశాలని కూడా మొహం మీద కొట్టినట్టు చెప్పేసింది.
తాను నైతిక విలువలు కలిగిన ఒక పద్ధతికి ,విధానానికి ఒక జీవన శైలికి అలవాటు పడ్డానని , తన పెంపకమే అలాంటిదని, ఇలాంటి పనికిమాలిన అసభ్య షోలు తనకు వద్దంటూ చెప్పేసింది . ఎంత డబ్బులిచ్చినా ,వేరొకరితో పడుకోమంటారా ? ఇదేనా నీతి అంటూ దులిపేసింది. దీంతో అసలు బిగ్ బాస్ షో లో ఒక స్థాయి నటులు హీరోయిన్లు పాల్గొనడానికి ఇక భయపడే పరిస్థితి . దాదాపు దాన్ని అలగా జనం పాల్గొనే ఒక కార్యక్రమంగా జనం కూడా చెప్పుకుంటారు. తనుశ్రీదత్త కూడా అదేచెప్పింది.
ప్రస్తుతం తను శ్రీ దత్త అమెరికాలో ఉంటున్నారు . ఆమె సినిమాలకు స్వస్తి చెప్పే తర్వాత ఆధ్యాత్మికంగా తన పంథాలో తాను జీవిస్తున్నారు. . ఆమె ఇప్పటివరకు పెళ్లి కాకుండా కూడా ఉండిపోయారు. గతంలో మీ టు గతంలో మీ టు ఉద్యమం జోరుగా ఉన్న సమయంలో కూడా తను శ్రీ దత్త , నానా పటేకర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు . అప్పుడప్పుడు ఆమె ఇలా వార్తలకి ఎక్కి సంచలనాలు సృష్టించినప్పటికీ , ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ షోలో పాల్గొను పోవడానికి కారణాలు చెప్పి ఆ షో బాగోతం బయటపెట్టారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

