వ్యాధుల నిర్ధారణలో రక్త పరీక్ష, స్కానింగ్ లాంటి ఖరీదైన ప్రాథమిక పరీక్షలు అవసరం లేకుండానే, చెమట చుక్క ద్వారా వ్యాధుల నిర్ధారణలో సిడ్నీ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. నేటి కాలంలో రక్త పరీక్షలు, ఇతర పరీక్షల పేరుతోనే వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. జబ్బు నిర్ధారణలోనే పేషెంట్ కు వేల రూపాయలు డబ్బు ధారపోసుకుని దుస్థితి. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది . వ్యాధుల నిర్ధారణకు సూదులు, రక్త పరీక్షలు, స్కానింగ్ , ఇలాంటి వాటితో పని లేకుండా ప్రాథమిక స్థాయిలో వ్యాధి నిర్ధారణకు చెమటతో పరీక్షలు చేసి సత్ఫలితాలు సాధించవచ్చునని చెందిన సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు .
చెమటతో రోగ లక్షణాలను తెలిపే సూక్ష్మ సెన్సార్
క్లినికల్ టెక్నాలజీలో శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఓ సూక్ష్మ పరికరాన్ని కూడా రూపొందించారు. డయాబెటిస్, క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులకు కూడా చెమటతోనే పరీక్ష చేసి ప్రాథమికంగా నిర్ధారించవచ్చునని, ఆ తర్వాత అవసరమైతే రక్త పరీక్షలు స్కానింగ్ ఇలాంటి వాటికి సిఫార్సు చేయవచ్చునని చెప్తున్నారు. చెమటతో పరీక్ష నిర్వహించి దానిలో వచ్చిన ఫలితాలను కృత్రిమ మేధ ద్వారా అధ్యయనం చేశామని 98 శాతం పేషంట్ల విషయంలో ఫలితాలు కచ్చితంగా రాబట్టామని చెప్తున్నారు .సూదులు రక్త పరీక్షలు ఇలాంటి కష్టమైన విధానాలతో ఇబ్బంది లేకుండా ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని అన్నారు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధ శాస్త్రవేత్తలు చెమటతో రోగ లక్షణాలను తెలిపే ఈ సూక్ష్మ సెన్సార్ కనుగొన్నారు. ప్రాథమిక దశలోనే ఈ పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

