ఏ గూటి చిలుక ఆ పలుకు పలుకుతుందని .. ఓ సామెత ఉంది.. ఈ సామెత ఊరకే వచ్చిందికాదు.. పెద్దలు అనుభవం మీద చెప్పిన నిజం ఇది.. బ్రిటన్ లో లింక్లోషైన్ పార్క్ లో , పర్యాటకులకు ఐదు ఆఫ్రికన్ గ్రే చిలుకలతో పెద్ద చిక్కు వచ్చిపడింది. అవి పార్క్ కి వచ్చేవారిని అసభ్యంగా తిట్టేవి. ఒకదానినొకటి తిట్టుకునేవి. మద్యమద్యలో విజిటర్స్ ని తిట్టేవి.. ఇదేందబ్బా , మాట్లాడే చిలుకలకు తిట్లు ఎలా వచ్చాయని పార్క్ అధికారులు కూడా ఆశ్చర్యపోయేవారు. క్రమంగా పర్యాటకులు , ఆ చిలుకలపై పార్క్ అధికారులకు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు.
తమను అసభ్యంగా తిట్టే చిలుకలపై చర్య తీసుకోవాలని కోరారు. దీంతో అసలు ఆ చిలుకలు పార్క్ కి ఇచ్చిన ఐదుగురు వ్యక్తులను విచారించారు. వాటిని పెంచుకున్న యజమానులు ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తలు మధ్య తగాదాలు జరిగేవట.. ఆ సందర్భంగా తిట్టుకునే పదాలను ఇవి నేర్చుకుని , విజిటర్స్ ని కూడా తిట్టడం మొదలు పెట్టాయి. దీంతో పార్క్ అధికారులు ఆ చిలుకలను ఒకే గూటి నుంచి వేరుచేసి , మంచి చిలుకలతో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గూటిలో ఉంచారట,.. మరి మంచి చిలుకలు బాష ఇవి నేర్చుకుంటాయో, బూతు చిలుకల బాష మంచి చిలుకలు నేర్చుకుంటాయో చూడాలి..

