నోటి దూల మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.బుద్ధిలేని వ్యాఖ్యలు అంటూ మందలించి , హైకోర్టు ఆదేశాలపై స్తే ఇచ్చేందుకు నిరాకరించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం సమయంలో కీలకంగా వ్యవహరించినభారత్ మహిళా మిలిటరీ అధికారి కల్నల్ కురేషిని , తీవ్రవాదుల చెల్లెలుగా పోల్చిన విజయ్ షా వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై దేశ ద్రోహం, కల్లోలాలకి కుట్ర నేరాలపై కేసుపెట్టాలని ఆదేశించింది. దీంతో విజయ్ షా పై కేసు నమోదైంది.
అయితే తనపై నమోదైన కేసుకు సంబంధించి స్టే ఉత్తర్వులు ఇవ్వాలని విజయ్ షా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై విచారించిన ధర్మాసనం విజయ్ షా పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశం ఉన్న పరిస్థితుల్లో విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమని స్పష్టం చేసింది. తీవ్ర స్థాయిలో మందలించే వ్యాఖ్యలు చేసి , స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు చెయ్యాల్సిన పనికాదని, మాట్లాడాల్సిన మాటలు కాదని మందలించింది. షాపై బెయిల్ కి వీలులేని కేసులు నమోదు చేసారు.

