ఈ ఏడాది వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండలు మండిపోనున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనావేస్తోంది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కృష్ణా , ప్రకాశం,కడప , నెల్లూరు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు..
ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. టోపి, కర్చీఫ్, తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

