పరీక్షా విధానంలో ఎన్నో సంచలనాత్మకమైన మార్పులు వస్తున్నాయి . ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పులన్నీ కూడా ఆశావహంగా విద్యార్థుల సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగానే ఉంటాయి. అయితే మన దేశంలో మాత్రం కీలకమైన పోటీ పరీక్షలకు ముందు పెట్టే నిబంధనలు విద్యార్థులు మానసిక స్తైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి. వాళ్ళ ఆత్మ విశ్వాసాన్ని కూడా కించపరిచే విధంగా ఉంటాయి. ఇది పరీక్షల్లో కూడా ప్రభావితం చూపుతుంది. మహిళా విద్యార్థులైతే పరీక్షకు పోయేప్పుడు పూలు పెట్టుకోకూడదని, పిన్నులు వేసుకోకూడదు, ఉంగరాలు పెట్టుకోకూడదని, కమ్మలు పెట్టుకోకూడదని, మెడలో లాకెట్ ఉండకూడదని, చెప్పులు కూడా లేకుండా లోపలికి వెళ్లాలని ఇలా బోలెడు షరతులు పెడుతున్నారు.
అబ్బాయిలకు అయితే షూస్ వేసుకోవద్దని ,సాక్స్ వేసుకోవద్దని , వాచీలు, బెల్టులు ఉండకూడదని ఇలా రకరకాల నిబంధనలతో విసిగించి ,వేసారేటట్టు చేయడం మన పరీక్ష విధానం ప్రత్యేకత. అక్రమాలు నిరోధించేందుకు అనేకమార్గాలు ఉన్నప్పటికీ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పెట్టి దొంగల మాదిరి విద్యార్థులను తనిఖీలు చేయడం సమంజసం కూడా కాదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనాగరికమైన వాతావరణంలో పరీక్షలు జరిగేది మనదేశంలోనే. సౌదీఅరేబియాలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తేలికైన ఆహరం , డ్రింక్స్ తీసుకుపోయే అవకాశాన్ని కల్పించారు. ఏదైనా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం లాంటివి తీసుకోబోయేందుకు విద్యార్థులకు పర్మిషన్ ఉంది .
పరీక్షలు రాసే సమయంలో ఆందోళన వల్ల, అలసట వల్ల డిహైడ్రేషన్ ప్రమాదం కూడా ఉంది . ఇది వైద్యశాస్త్ర పరంగా కూడా నిరూపితమైంది. ఇలాంటి సమయంలో విద్యార్థులు ఏదైనా ఆహారం తీసుకొని జ్యూస్ కానీ నీళ్లు కానీ తాగగలిగితే అది కొంతవరకు వారి శారీరిక , మానసిక సామర్ధ్యాన్ని కొంత పెంచుతుంది. మానసికంగా కూడా వారిని బలవంతం చేస్తుంది . ఈ విధానం వల్ల విద్యార్థులకు పరీక్ష హాల్లో ఫియర్ ఫోబియా అంటే భయం వల్ల కలిగే ఆందోళన ఉండదు. దీంతో విద్యార్థుల నైతిక బలం పెరుగుతుంది . తాము రాయాలనుకున్నది వివరంగా , విశ్లేషణాత్మకంగా జవాబులు రాయడానికి ఇలాంటి పరీక్షా విధానం ఉపయోగపడుతుంది. దీనినే సౌదీ అరేబియాలో ప్రవేశపెట్టారు .
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

