సృష్టిలో స్టార్ ఫిష్ ఒక అద్భుత జీవి . బహుశా పునర్జన్మ ,లేదా దేహం మళ్లీ పునర్ నిర్మాణం కావడం, పోగొట్టుకున్న శరీర భాగాలను మాయ మంత్రంతో మళ్లీ అతికించినట్టు .. పాతకాలపు కథలకు ఇదొక ఉదాహరణ . సృష్టికర్త ఈ స్టార్ ఫిష్ ను ఒక అద్భుతమైన జీవిగా మలిచాడు . చనిపోయిన వాళ్ళు బ్రతకడం లేదా పోగొట్టుకున్న అవయవాలు మొత్తాన్ని మళ్లీ తిరిగి పొందడం అనేది బహుశా ప్రాణకోటిలో అసాధ్యం . అయితే ఒక్క స్టార్ ఫిష్ కు మాత్రమే అది సాధ్యం .
స్టార్ ఫిష్ లో ఏ భాగం పోయినా లేదా మొత్తం శరీరం అంతా ముక్కల ముక్కలైపోయినా దాని ప్రధానమైన నాడీ వ్యవస్థకు సంబంధించి ఒక్క అవయము బాగుంటే మిగిలిన అవయవాలన్నింటినీ 45 రోజులు అది తిరిగి పొందుతుంది . మామూలు స్టార్ ఫిష్ గా బ్రతుకుతుంది. మళ్లీ యధా ప్రకారం పూర్తి రూపాన్ని అందమైన ఆకారాన్ని సంతరించుకొని సృష్టిలో ఒక అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ స్టార్ ఫిష్ పునర్జన్మ లేదా పునర్నిర్మాణం ఇప్పుడు వైద్య రంగంలో అనేక పరిశోధనలకు దారి తీస్తుంది.
ఒక జీవి స్టార్ ఫిష్ లాంటి జీవి అవయవాలను మొత్తం పోగొట్టుకొని ఒకే ఒక్క అవయవంతో బతికినప్పటికీ పోగొట్టుకున్న ఆవయవాలు అన్నింటిని పొంది మళ్లీ యధా రూపం సంతరించుకుని ఉంటుంది. ఈ అద్భుతంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని అవయవాలు పోయినా ఒక్క అవయవం ఉంటే దేహంలోని రసాయనాలు తిరిగి మళ్లీ ఆ భాగాలన్నీ పొందేందుకు సహకరించే వ్యవస్థపై పరిశోధనలు చేస్తున్నారు .
ఇది విజయవంతం అయితే మానవులు కూడా పోగొట్టుకున్న అవయవాలను లేదా పోయినా అవయవాలను ప్రమాదాల్లో తెగిపోయిన అవయవాలను ఆటోమేటిక్ గా పొందే అవకాశం ఉంది. స్టార్ ఫిష్ లోని ఆ పురుజ్జీవం ఎలా సాధ్యమో తెలిస్తే భవిష్యత్తులో వైద్య రంగంలో ఒక విప్లవం రానుంది..

