సరోగసీ పేరుతో జరిగిన కుంభకోణంలో అసలు అలాంటిది ఏమీ జరగలేదని తేలింది. డాక్టర్ నమ్రత దారుణ మోసం వెలుగులోకి రావడంతో , టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు, సరోగసీ సెంటర్లు, సంటాన సాఫల్య కేంద్రాలపై ప్రజలకు నమ్మకమే పోయింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో టెస్ట్ ట్యూబ్ బేబీ మోసంలో పోలీసు విచారణలో అసలు మోసం బయటపడింది. భర్త వీర్యంతో సరోగసీ పద్దతిలో బిడ్డ కోసం డాక్టర్ నమ్రత దగ్గరకు పోయిన వారిని ఆమె దారుణంగా మోసం చేసి , ఓ మహిళ వద్ద బిడ్డను 50 వేలరూపాయలకు కొని , వీళ్ళదగ్గర మొత్తం ట్రీట్మెంట్ ఖర్చుల కింద 45 లక్షలరూపాయలు వసూలు చేసింది.
అస్సాం కి చెందిన మహిళా తనకు బిడ్డవద్దని ఇచ్చేసి పోయిన , బిడ్డని , మీ భర్త వీర్యంతో , విశాఖకు చెందిన మహిళకు సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ అని నమ్మించి ఇచ్చింది. బిడ్డకు తరచూ ఆరోగ్యం బాగాలేకపోవడంతో , చేసిన పరీక్షలలో బిడ్డకు హెచ్ ఐవి ఉందని తేలింది. దీంతో ఆ దంపతులు ఆశ్చర్యపోయి , బిడ్డకు , తమకు డీఎన్ ఏ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో బిడ్డ తమ బిడ్డకాదని , తన భర్త వీర్యంతో బిడ్డ పుట్టలేదని తేలింది. దీంతో కేసు పెట్టారు.
తీగలాగితే డొంకకదిలినట్టు మోసం మొత్తం బయటపడింది. డాక్టర్ నమ్రత సరోగసీ చేయకుండానే , 45 లక్షలు వసూలు చేసింది. హాస్పిటల్ ఖర్చులకింద 30 లక్షలు , గర్భం అద్దెకు ఇచ్చిన మహిళకు 15 లక్షలు , మొత్తం 45 లక్షలు గుంజింది. అయితే విచిత్రం ఏమిటంటే వైద్యంలేదు, గర్భం అద్దెకిచ్చిన మహిళా లేదు ,డబ్బులు మాత్రం గుంజి, అనాధ బిడ్డను , సరోగోసీలో పుట్టిన బిడ్డ అని ఇచ్చేసి 45 లక్షలు గుంజేశారు. డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసారు.

