సిబిఎస్సీ పరీక్షల్లో టాప్ ర్యాంకర్ సృష్టి శర్మ.. 500 మార్కులకు, 500 మార్కులు దక్కించుకుంది. సూపర్ కిడ్ గా నిలిచింది. కోచింగ్ లు, ఎక్స్ట్రా క్లాసులు ,అంటూ రొదపెట్టి చతికిలపడే విద్యార్థులకు ఈ బాలిక కనువిప్పు కావాలి.ఇంట్లోనే పుస్తకాలూ ఫాలో అయ్యి, పుస్తకాల్లో ఒక్క పదం కూడా వదలకుండా , ప్రతీ లైన్, ప్రతి లెస్సన్ అర్ధం చేసుకుని పరీక్షలకు అటెండ్ అయింది.
టాప్ ర్యాంకర్ గా నిలిచింది. 500 మార్కులకు, 500 సాధించింది.. ఇదీ నిజమైన రికార్డ్ అంటే. సృష్టి విజయానికి కారణం ఆ బాలిక తల్లి తండ్రులే. ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తుంటారని చెప్పింది. సెపెరేట్ కోచింగ్ లాంటివి ఏవీ తీసుకోలేదని తెలిపింది. తన తండ్రి ఎప్పుడూ తనను ఎంకరేజ్ చేసేవారని, అనుమానం వస్తే వివరించి చెప్పేవారని , ఆయనే తనకు ఇన్స్పిరేషన్ అని గర్వంగా చెబుతొంది.

