22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

ఊసరవెల్లి రెండు కళ్ళను ఎటైనా తిప్పగలదు .

సృష్టిలో అనేక జీవులు చిత్ర ,విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి. వాటితో పోల్చుకుంటే మానవులు చాలా వెనకబడే ఉంటారు . ఊసరవెల్లి అనేక రకాలుగా విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది . ఊసరవెల్లి రెండు కళ్ళను ఎటైనా తిప్పగలదు . విచిత్రం ఏమిటంటే ఎవరికైనా ఒక కన్ను తిప్పితే రెండో కన్ను కూడా అటే తిప్పాల్సి వస్తుంది . కానీ ఊసరవెల్లి మాత్రం ఒక కంటినే తనకు అనుకూలంగా ఉన్న దిక్కున తిప్పగలదు. లేదా గుండ్రంగా తిప్పుకోగలదు రెండో కన్నుతో వేరే దిక్కులు చూడగలదు .ఇది ఊసరవెల్లి లో ఉన్న ఓ ప్రత్యేకమైన లక్షణం. సరీసృపాల్లోగానీ , జంతువుల్లో కానీ ఒక అరుదైన కంటి నిర్మాణం .

దీని నాలుక కూడా కిక్ ఫిక్స్ గం కంటే బలంగా ఉంటుంది . ఒకసారి అది ఎలాంటి కీటకమైనా దాని నాలుకకు తగిలిందంటే ఆ జిగట నుంచి వదిలించుకోలేదు . అది ఊసరవెల్లి కడుపులోకి రావాల్సిందే. ఊసరవెల్లులును గాని పెంచుకుంటే ఆ ఊసరవెల్లి ఏ యజమాని అయితే తన చేత్తో ఆహరం ఇస్తాడో ఇది అతడి దగ్గర ఉండిపోతుంది . ఆహారం కూడా ఆ యజమాని ఇస్తేనే తింటుంది . అయితే ఊసరవెల్లి పెంచుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఊసరవెల్లి రంగులు మారుస్తుందన్న మాట ఎంతవరకు నిజమే. అయితే అది వాతావరణ పరిస్థితులను బట్టి రంగు మారుస్తుంది .

ఇతర ఊసరవెల్లలకు ఒక సంకేతాలు ఇచ్చేందుకు లేదా ఆడఊసరవెల్లితో తన కలయికకోసం భావోద్వేగాన్ని తెలిపేందుకు మాత్రమే రంగులు మారుస్తుంది. దీనికి కారణం వాటి చర్మం లో ఉన్న నానో క్రిస్టల్స్ అని ప్రత్యేక కణజాలం. ఈ కణజాలం వల్ల ఊసరవెల్లులు వాతావరణాన్ని బట్టి సూర్యకాంతిని బట్టి రంగులు మారుస్తాయి . ఆకుపచ్చ , నీలం ,ఎరుపు మరియు పసుపు రంగులో ఊసరవెల్లి రంగులు మార్చగలదు. ఒక్క ఆకుపచ్చ రంగు మాత్రం పూర్తి రంగుతో ఉంటుంది . మిగిలినవి 50 శాతం రంగు కలిగి ఉంటాయి ఈ రంగు మారే కణాలను ఇరుడో స్పోర్స్ అంటారు . ఇవి నానో క్రిస్టల్స్ లాంటి చిన్న చిన్న అతి సూక్ష్మ కణాలను , ద్రవ స్పటికాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి మారుతున్న కాంతిని బట్టి రంగులు మారుతాయి . ఊసరవెల్లిలోని భావోద్వేగాలు, అంటే భయం, కలయికకోసం ఆరాటం, వాతావరణం, తదితర విషయాలే ఊసరవెల్లులు రంగు మార్చే కారకాలు.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.