దేశంలో విమానయాన రంగం ,ఆర్టీసీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ఉంటే రైల్వేలు మాత్రం వందల, వేల కోట్ల రూపాయలు ఆదాయాలు దిశగా సూపర్ ఫాస్ట్ గా పరుగులు తీస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు దక్షిణ మధ్య రైల్వేకు 8593 కోట్ల రూపాయలు రెవెన్యూ సమకూరింది . ఇది గత అన్ని ఆదాయ వనరుల్లోకి ఎక్కువే. ఈ డివిజన్లో అధికంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల మధ్యకాలంలో దక్షిణ మధ్య రైల్వే లో 60 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేశారు. దీని ద్వారా 5634 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది . అంటే రైల్వేలో ప్రయాణికుల ట్రైన్స్ కంటే ,ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కంటే గూడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది .
గత ఏడాది ఇదే సమయంలో 8457 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ప్రయాణికులను చేరవేసే రైళ్ల ద్వారా 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఈ కాలంలో రెవెన్యూ వచ్చింది . ఇది కూడా గతంలో కంటే రెండు శాతం ఎక్కువ అని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు నెలల్లో 11 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశారట . గూడ్స్ రవాణాలో మొదటిగా బొగ్గు , ఆ తర్వాత సిమెంటు ,ఆ తర్వాత ఇనుప ఖనిజం , ఆ తర్వాత ఎరువులు ,ఆ తర్వాత స్టీల్ ప్లాంట్స్ కు అవసరమైన ముడి సరుకు, ఆ తర్వాత ఆహార ధాన్యాలు ఆ తర్వాత ఇతరత్రా సరుకులు రవాణా జరిగాయి.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

