22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

మిథున్ రెడ్డి అరెస్ట్ కి సిట్ పిటీషన్.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కానున్నారా..?? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. లిక్కర్ స్కాములో ఆయన ఇప్పటికే పీకల లోతుకు కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా మిథున్ రెడ్డి.. ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇది ఇలా ఉండగానే లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ.. విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మిథున్ రెడ్డి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొత్తరకం మద్యం పాలసీలను తీసుకొచ్చారు. విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించారు. నిబంధనలను తుంగలో తొక్కి.. నకిలీ బ్రాండ్ లను తయారు చేసి. మద్యం షాపులకు సరఫరా చేశారు. వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. అయితే ప్రభుత్వం మారాక.. ఈ లిక్కర్ స్కాం బయటకు వచ్చింది. విచారణ నెలలపాటుగా సాగింది. ఈ లిక్కర్ స్కాములో వచ్చే డబ్బంతా చివరికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చేరిందని విచారణలో తేలింది.

అక్కడి నుంచి డబ్బు ఓ అజ్ఞాత వ్యక్తికి వెళ్లిందని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. విచారణ చివరిదశకు చేరుకునే సరికి మిథున్ రెడ్డికి భయం పట్టుకుంది. విజయవాడ కోర్టులో బెయిల్ పిటీషన్ తిరస్కరించడంతో.. సుప్రీం కోర్టులో కూడా బెయిల్ పిటీషన్ మూవ్ చేశారు. అయితే సుప్రీం కోర్ట్ కూడా బెయిల్ పిటీషన్ తిరస్కరించడంతో.. మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే.. లిక్కర్ స్కాములో అసలు సూత్రధారి ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.