విమాన ప్రయాణం అంటే వందలు, వేల కిలోమీటర్ల ప్రయాణం. దూరతీరాలకు పోవాలంటే ఎక్కువ మందికి ఇదొక్కటే మార్గం. కొన్ని విమాన ప్రయాణాలు 30 గంటలు పట్టొచ్చు. ఏకబిగిన 24 గంటలు నాన్ స్టాప్ గా నడిచే విమానాలు కూడా ఉన్నాయి. అయితే ఒక్క నిమిషంపాటు ఉండే విమాన ప్రయాణం ప్రపంచంలో ఒకటుంది. అది ప్రతి రోజూ బిజీగానే ఉంటుంది. ఈ విమాన ప్రయాణం అతితక్కువ అంటే రెండున్నర కిలోమీటర్ల దూరమే ఉంటుంది.
ఇది రెండు దీవుల మధ్య ఉంటుంది. ఈ దీవి ఒడ్డునఉండి చూస్తే ఈ దీవిఒడ్డున ఎవరున్నారో చూడొచ్చు. అయినా ప్రయాణీకులు రెండు దీవుల మధ్య విమానంలో పోయి వస్తుంటారు. రెండు దీవుల మధ్య ప్రయాణ సమయం 53 సెకన్లు. టేకాఫ్, లాండింగ్ కి రెండు నిమిషాలు. ఇదీ ఆ విమాన ప్రయాణం విశేషం. ఈ విచిత్ర డైలీ ఫ్లయిట్ సర్వీస్ స్కొట్లాండ్ లోని ఆర్కే దీవులలో ఉంది. వేస్టరే తో పాపవేస్ట్రే అనే చిన్న దీవుల మధ్య ఈ సర్వీస్ నడుస్తోంది. 1963 నుంచి ఈ విమాన సర్వీస్ నడుస్తోంది.

