తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో BRS అధికారంలో ఉండగా.. అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను టాప్ చేశారు. అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్ చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ చేశారు. అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ చేసి.. సమాచారాన్ని సేకరించారు.
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు సేకరించి.. ఆ సమాచారాన్ని జగన్ కు చేరవేసేవారు. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు పంపించారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్క నేతపై నిఘా ఉంచారు. తెలంగాణాలో ఓ సీనియర్ పోలీస్ అధికారి షర్మిల దగ్గరి మనుషులను పిలిపించి.. వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు షర్మిల అప్పట్లోనే గుర్తించిందని సమాచారం.
తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నాలుగో సారి సిట్ ముందు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. మొత్తానికి అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. తెలంగాణలోని BRS, ఏపీలో జగన్ కు కీలక సమాచారాన్ని పంపేవారని తెలుస్తోంది.

