ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో రాజ్యసభకు నామినేట్ కానుంది.. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనుంచి ఆమెను రాజ్యసభకు ఎంపికచేస్తారని తెలుస్తోంది. దక్షిణభారతదేశంలో ఆంద్రప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, రాష్ట్ర విభజన , తండ్రి మరణం తరువాత సీఎం పదవి ఇవ్వలేదని జగన్ ఎదురుతిరగడంతో కాంగ్రెస్ రాత మారింది. జగన్ పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో , కాంగ్రెస్ మొత్తం విలీనం అయినట్టు మారిపోయింది. కాంగ్రెస్ ఓటర్లంతా ఒక భావోద్వేగంతో జగన్ వైపుచేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ఇల్లు ఖాళీ అయిపొయింది.
అనేక ప్రయోగాల తరువాత పార్టీ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ కుమార్తె షర్మిలకు అప్పగించింది. ఆమె తప్ప కాంగ్రెస్ పార్టీలో గ్రామస్థాయిలో పలుకుబడి గలిగిన నేతలు కూడా లేరు. ఇప్పుడుకూడా వైసిపిలో ఉన్న ఓటర్లంతా కాంగ్రెస్ ఓటర్లే. జగన్ పై భ్రమలు తొలగిపోతున్న తరుణంలో పార్టీను మళ్ళీ పునరుద్దరించి , పూర్వ వైభవం తీసుకురావాలని ఉన్నప్పటికి , నాయకత్వ లేమి ఆ పార్టీని ముందుకుపోనివ్వడంలేదు. జగన్ విఫలం అయితే , రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ పార్టీలో ఇప్పటికీ ఉన్నవారు ముప్పాతికభాగం కాంగ్రెస్ భావజాలంతో ఉన్నవారే.. అందుకే రాష్ట్రంలో ఒక రాజ్యసభ స్తానం , బయట రాష్ట్రాల నుంచి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే షర్మిల తప్ప వేరే నేతలు లేరు..

