సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో వైఎస్ హయాంలో ఆమె మైనింగ్ అనుమతులలో కీలకంగా వ్యవరించారు. జగన్ తో పాటే నెలలుతరబడి జైల్లో ఉండి , బెయిల్ పై బయటకొచ్చారు. తరువాత జగన్ సీఎం అయినా తరువాత మళ్ళీ కీలకంగా వ్యవరించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆమెను కేసునుంచి తప్పిస్తూ హైకోర్టు ఆదేశాలతో ఆమె యధావిధిగా ఉన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలపై , సిబిఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
నిన్ననే సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి , ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డికి, అప్పటి మైనింగ్ ఎడి, రాజగోపాల్ కి ,ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి మైనింగ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టు ఆదేశాలతో ఈ కేసులోనుంచి ఇదివరకే బయటపడ్డారు అయితే ఇప్పుడు ట్విస్ట్ ఆమెకు ఇబ్బందిగా మారింది. గతంలో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు తీర్పుని పక్కన బెట్టి, మూడునెలల్లో తాజాగా విచారణ జరిపి నివేదిక ఇవ్వమని సుప్రీం కోర్టు ఆదేశించింది.

