22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

అమర్నాధ్ యాత్రలో పాక్ కుట్రలపై పారాహుషార్

కోట్లాదిమంది హిందువుల కలల యాత్ర అమర్నాథ్ యాత్ర . హిమాలయాల్లో 12 వేల అడుగుల ఎత్తులో ఉండే అమర్నాధ్ గుహలో మంచుతో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగ దర్శనం పరమ పవిత్రం, పావనమైన యాత్ర. వచ్చేనెల మూడవ తేదీ నుంచి 9వ తేదీ వరకు అమర్నాథ్ యాత్రకు భద్తతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే అమర్నాథ్ యాత్రలో అతి ముఖ్యమైన పెహల్గావ్ మరియు బల్తాల్ రహదారులను అత్యంత పటిష్టమైన భద్రతా వలయంలో ఉంచారు.

గగనతలంలో విమానాలు తిరగకుండా ఆదేశాలు జారీ చేశారు . జూలై ఒకటో తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. అమర్నాథ్ బలతాల్ నుంచి 14 కిలోమీటర్లు, పెహల్గావ్ నుంచి నలభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు కొండ దారులపై ఎటువంటి విమానాలు కానీ, డ్రోన్ విమానాలు కానీ ,డ్రోన్లు కానీ ,హెలికాప్టర్లు కానీ ఎగరకుండా ఆదేశాలు జారీ చేశారు .

భక్తుల భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నారు . పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోనే ఉండే ఈ ప్రాంతాల్లో ఇలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరంగా రక్షణ శాఖ భావించింది . ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. దీనికి తోడు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంలో మళ్లీ తీవ్రవాద శిబిరాలు వెలుస్తుండడంతో రక్షణ శాఖ ఈ కఠినమైన చర్యలను తీసుకుంది . అమర్నాథ్ యాత్ర వెంబడి గతంలో కంటే రెండింతలు ఎక్కువగా భద్రతా బలగాలను మోహరించారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.