ప్రకృతిలోని ఆకుపచ్చ రంగుకి ,మానవ జీవితానికి ,మనస్తత్వ శాస్త్రానికి ,వైద్యశాస్త్రానికి సంబంధం ఏమిటి? ఇదొక అంతుబట్టని బంధం. ఆరోగ్యకరమైన అనుబంధం . ఆకుపచ్చ రంగుతో మానవ జీవితం ముడిపడి ఉంది . పచ్చటి ప్రకృతికి ఆకుపచ్చని చీర గట్టినట్టు ఉంటుంది ఆ జీవితం. ఆకుపచ్చ రంగు ఒక్కటే మనసుని ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంచుతుందట. అందుకే ప్రకృతి ఒడిలో ఉన్న మనుషులు ఎక్కువ కాలం ఆందోళన, జబ్బులు లేకుండా గడపగలరు . రోజుకి గంటసేపు పొలాలు, చెట్లమధ్య ప్రకృతిలో లీనమైతే అన్నీ మైమరిచిపోతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది .నరాల పట్టుత్వం పెరుగుతుంది. కొన్ని వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి. చాలా జబ్బులకు మూలకారణమైన మానసిక వత్తిడి తగ్గితే అన్నీ సర్దుకుంటాయి.
ఆ మానసిక వత్తిడి తగ్గేందుకు ప్రకృతిని చూస్తూ గంటసేపు గడపగలిగితే మంచిదని ప్రాచీన గ్రంధాలేకాదు, ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెబుతొంది. అందుకే వైద్యశాస్త్రం మొదలైన నాటి నుంచి హాస్పిటల్స్ లో ఆకుపచ్చ లేదా నీలం రంగునే డాక్టర్లు వాడుతారు. ఆపరేషన్లు చేసే సమయంలో కూడా రోగికిగానీ, పడకపైగానీ , డాక్టర్ వేసుకునే డ్రెస్స్ గానీ తలకు క్యాప్ గానీ ఆ రంగులోనే ఉంటాయి. దీనికి కారణం ఆకుపచ్చ రంగు మనసుకు ,మనస్తత్వ శాస్త్రానికి ఆరోగ్యానికి సంబంధించింది . ఇదే కాదు జపాన్లో జపాన్ రైల్వే స్టేషన్ లో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతుండడంతో అక్కడ కూడా రాత్రి సమయాల్లో ఆకుపచ్చ, నీలం రంగు కలిపిన కలిసిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
వీటి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే వారి మనసుల్లో మార్పు వచ్చిందని ,ఇప్పుడు గతంలో కంటే 15శాతం ఆత్మహత్యలు తగ్గాయని చెప్తున్నారు.ఆకుపచ్చ రంగు పున్న ప్రాధాన్యత దృష్టాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా ఆకుపచ్చ రంగు వెలిగితేనే వాహనాలు కదులుతాయి . అంటే ఆకుపచ్చ రంగు చూస్తేనే ఆ ప్రశాంతత మనసుకు కలుగుతుంది . అది ఉల్లాసానికి కారణం అవుతుంది. అందులో మహత్యం ఇది . అందుకే ప్రకృతి ఒడిలో పెరిగే మనుషులు ఆందోళన, మానసిక ఒత్తిడి లేకుండా , స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఎక్కువ కాలం దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉంటారు . ఆకుపచ్చ రంగులో ఉన్న మహత్యం అదే..
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

