22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

42 ఏళ్ళ తరువాత ప్రియుణ్ణి అనాధాశ్రమంలో చూసి.

నిజమైన ప్రేమకు జాతి, మతం, కులం, ధనం ఇవేవీ ఉండవు. వీటన్నింటికీ అతీతమైనది ప్రేమ. ఇదొక అద్భుతమైన అనుభవం. అద్వితీయమైన ఆనందం. నిజమైన ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంటుంది. దాన్ని విడదీస్తే అది ఎప్పుడు మనసులోనే ఉండిపోయి నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. జీవిత కాలం బాధిస్తూనే ఉంటుంది. అలాంటిదే ఈ ప్రేమ.

ఓ మాజీ ఓ ప్రియురాలు చిన్ననాడే విడిపోయిన తన ప్రియుడు కోసం 42 ఏళ్ళు నిరంతర అన్వేషణ సాగించి అతడిని చేరుకుంది. అతడు ఇతరులను గుర్తుపట్టలేని స్థితిలో నర్సింగ్ హోమ్ లో ఉండగా అతడిని తాను గుర్తుపట్టి బాగు చేయించి మళ్లీ పెళ్లి చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 69 అతడు వయసు 72. అయినా ప్రేమ వారిద్దరిని ఒకటి చేసింది. తరాలు, అంతరాలు, జాతివైషమ్యాలు, అంటని స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి అది ప్రపంచవార్తలకి ఎక్కింది. అందరి ఆశీస్సులను అందుకుంది.

జీన్ మరియు స్టీఫెన్ 1971లో చికాగోలోని లయోల కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆమె శ్వేత జాతీయురాలు. అతడు నీగ్రో జాతికి చెందిన యువకుడు. దీంతో వాళ్ళ ప్రేమను ఆమె కుటుంబం ఒప్పుకోలేదు. ఆమె నుంచి ఒత్తిడి తీవ్రం అవడంతో జీన్ , స్టీఫెన్ తో కలిసి తిరిగేందుకు వీలు లేదని కుటుంబం ఆంక్షలు పెట్టి కాలేజీ కూడా మాన్పించేసింది. విరహంతో స్టీఫెన్ చదువు మానేసి ఎటో వెళ్లిపోయాడు. జీన్ కు వేరే పెళ్లి చేశారు. కొంతకాలానికి ఆమె విడాకులు తీసుకుంది. ఆతర్వాత ఫ్రాన్స్ కెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తోంది. స్టీఫెన్ కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు. అతడు పెళ్లి చేసుకొని కొద్ది కాలానికి విడాకులు తీసుకున్నాడు. ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఎవరి జీవితాలు వారివే .అయితే ఇద్దరి మనసులోనూ ఇద్దరూ నిలబడిపోయారు.

నిత్యం, నిరంతరం ఒకరిని గురించి ఒకరు ఆలోచించుకుంటూ గడిపేశారు. ఆమె మాత్రం 42 ఏళ్లుగా అతడి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎక్కడున్నాడో కనుగొనే ప్రయత్నాన్ని అమెరికాకు వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉంది. చివరకు 42 ఏళ్ల తర్వాత ఆమె ప్రయత్నాలు ఫలించాయి . అనారోగ్యంతో 18 ఏళ్లుగా ఓ నర్సింగ్ హోమ్ లో ఉండిపోయిన స్టీఫెన్ అక్కడే మంచానికే పరిమితం అయిపోయాడు. అతి కష్టం మీద అతడి ఆచూకీ కనుక్కున్న ఆ తర్వాత నర్సింగ్ హోమ్ లోనే అతనితో ఉండిపోయి స్టీపెన్ కు సరైన వైద్యం చేయించి అతనిని మనిషిగా మార్చుకుని ఆ తర్వాత ఓరిగాన్ పట్టడానికి తీసుకెళ్లి ఏడాది పాటు అతనికి సపర్యలు చేసి చేసి పెళ్లి చేసుకుంది .

పెళ్లి చేసుకునే నాటికి స్టీపెన్ కి 72 జీన్ కు 69 ఏళ్ల వయసు. ఇద్దరికీ వయసు అడ్డంకి కాదని, చిన్ననాడే మనసులో వికసించిన ప్రేమ వాడిపోకుండా అలాగే ఉందని అందుకే విధి దూరం చేసినా విధిని ఎదిరించి, తాను 42 ఏళ్ళు తన ప్రియుడు కోసం అన్వేషణ చేశానని చెప్పింది. ఆరోగ్యం బాగాలేక, తను ఎవరో మరిచిపోయి ఉన్న స్థితిలో అతడిని మనిషిని చేసి మళ్లీ తనదానిగా చేసుకున్నానని తెలిపింది .వీరిద్దరి వివాహానికి వందలాదిమంది హితులు, అభిమానులు, ఆనాటి సహవిద్యార్ధులు హాజరై దీవించారు. ఇప్పుడు ఇద్దరూ ఒకటిగా ఆనందంతో ఉన్నారు. నిజమైన ప్రేమకు జాతి , కులం కాలం అడ్డు కాదని ఈ ప్రేమ నిరూపించింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.