జనసేనకు నాగబాబు గుదిబండలాగా తయారుకాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సోదరుడు అన్న ఏకైక అర్హతతో ఎమ్మెల్సీ పదవి తీసుకున్న నాగబాబు పుణ్యమా అని పిఠాపురంలో జనసేన, టిడిపి మధ్య చిచ్చు రేగింది. ఆయన మంత్రికాకముందే ఇంత రగడకు కారణమయ్యారు. ఇక మంత్రి అయిన తరువాత ఎక్కడ చిచ్చు పెడతాడో ఆనం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నాగబాబు పిఠాపురం పర్యటనలో అపశృతులు చోటు చేసుకున్నాయి. టిడిపి కార్యకర్తలు గో బ్యాక్ నాగబాబు అంటూ టిడిపి నినాదాలు చేసారు.
దీంతో పిఠాపురంలో భారీగా మోహరించిన పోలీసులు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా చూస్తున్నారు. నాగబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలుతో పట్టణం అట్టుడికింది. ఇరువర్గాలు బలబలాలు ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో జై వర్మ అంటూ జైజై టీడీపీ, జై జనసేన అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తల నినాదాలు చేస్తున్నారు. ఇదివరకు వర్మపై నాగబాబు చేసిన వ్యాఖ్యలే ఈ గొడవకు కారణం అయ్యాయి..

