ల్యాండ్ ఫోన్ నుంచి వైర్లెస్ ఫోన్ కు ,వైర్లెస్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్.. ఇలా అద్భుతమైన సాంకేతిక విప్లవంలో నేటి యుగం ఉంది. ఎన్నో అద్భుతాలను చూస్తోంది . మొన్నటి తరం నుంచి నేటి తరం వరకు ఉన్నవారు ఆనాటి అనుభూతులను ,ఆనాటి అనుభవాలను నేటి అద్భుతాలను సరిపోల్చి చూసుకుంటే అర్థం కాని లోకం ఇది. అద్భుతమైన సాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతొంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్ మయమైపోయింది . అన్నిటికి మొబైల్ ఫోన్ దిక్కుగా మారింది . దాదాపు 200 రకాల నిత్య సేవలు మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి . చివరకు చదువుకునేందుకు కూడా మొబైల్ ఫోన్ పెద్దదిక్కుగా మారింది . ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో అద్భుతానికి చైనా పురుడబోసింది.
అదేంటంటే ఉపగ్రహం నుంచే నేరుగా మొబైల్ ఫోన్ కు సిగ్నల్స్. కాల్ చేయాలన్నా , వీడియో కాలింగ్ చేసుకోవాలన్నా , మొబైల్ లో సెర్చ్ చేసుకోవాలన్న ఏదైనా సరే రాబోయే కాలంలో నేటి మొబైల్ టెక్నాలజీకి కాలం చెల్లిపోయేట్టుంది. రాబోయే కాలంలో మొబైల్ ఫోన్ టవర్లు ఇలాంటివి ఏమీ లేకుండానే అంతరిక్షం నుంచి నేరుగా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది . దీనికి ప్రత్యేకంగా శాటిలైట్ ఫోన్ అవసరంలేదు. మామూలు స్మార్ట్ ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఇలాంటి ఫోన్లకు నంబర్లు కూడా అవసరం లేదు . ఎవరికి వారుగా డిజిటల్ సిస్టంలో కోడ్ నంబర్లు ఫీడ్ చేసుకోవాల్సిన పరిస్థితి . దీనికి ఇప్పుడు ఒక విధానాన్ని అమలుచే చేసి , ప్రపంచానికి అందించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.
ఇదిటెలికామ్యూనికేషన్ రంగంలో ఒక విప్లహాత్మకమైన మార్పులకు తెరదీసింది. అయితే దీనిలో కొన్ని భద్రతా కారణాలు ఇమిడి ఉన్న దృష్ట్యా ఇందుకోసం కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించిన తర్వాత చైనా వీటిని అమల్లోకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది . సెల్ఫోన్ సిగ్నల్స్ అందని దూర ప్రాంతాలు ,అడవులు ,సముద్రాలు ,ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో ,సెల్ టవర్స్ ఎక్కడికైతే చేరేందుకు వీలులేదో అలాంటి ప్రాంతాల్లో ఇది ఉపయోగకరంగా ఉండగలదు. అయితే భవిష్యత్తులో కమ్యూనికేషన్ రంగంలో ఇది నమ్మలేని, నమ్మశక్యం కాని మార్పులకు దారి తీయవచ్చు. ప్రపంచాన్ని సమాచార పరంగా మరింతగా ఏకం చేసే ఈ సాటిలైట్ మొబైల్ ఫోన్ మరో అద్భుతం కాబోతోంది . నేటితరమే ఈ అద్భుతాన్ని చూడబోతోంది.

