హీరోయిన్ సమంత ఆనందలో మునిగి తేలుతుంది . తన ఆనందాన్ని ఆమె సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సహజీవన భాగస్వామితో మైమరిచి ఉన్న పోటోపెట్టి పంచుకుంటున్నారు. ఆ ఆనందాలు శుభం విజయాన్ని ఉద్దేశించినవా లేదంటే కొత్త భాగస్వామిగా ప్రచారంలో ఉన్న రాజ్ నిడుమోరుని ఉద్దేశించి చేస్తున్నవా అనేది సస్పెన్స్ . ఈ విషయమై మీడియాలో రకాలుగా పుకార్లుస్తున్నప్పటికీ తమ ప్రేమను,తమ ఇద్దరి మధ్య బంధాన్ని, తాము డేటింగ్ లో ఉన్నామన్న ప్రచారాలను అటు సమంత గాని ఇటు రాజ్ నిడుమోరు గానీ ఇంతవరకు ఖండించలేదు.
ఈ నేపథ్యంలో రాజ్ నిడుమూరు భార్య శ్యామలాడే ఓ మాటల తూటా పేల్చింది. తన గురించి ,తన జీవితం గురించి,తన వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్న వారికి ,మద్దతిస్తున్న వారికి ,ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలియజేసింది. రాజ్ నిడుమోరుతో 10 ఏళ్ల క్రితమే శ్యామల డే కి పెళ్లి అయింది. వారికి ఒక కూతురు కూడా ఉంది . ప్రస్తుతం విడిగా ఉంటున్న వీళ్ళిద్దరూ విడిపోయారని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. సమంతతో డేటింగ్ లో ఉన్నారన్న నిజాన్ని కూడా ఎవరు కాదనలేరు.
అయితే తెరచాటు మాటలతో తమ సంబంధాన్ని బయట పెట్టుకుంటూ సమంత కూడా ఇటీవల ఒక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తమ బంధం ప్రేమ ,విజయంతో మొదలైందని ఆమె అన్న ఒక్క మాటలోనే అన్నీ అర్థం అయిపోయాయి. రాజ్ .నిడుమోరు భార్య సోషల్ మీడియాలో తన గురించి ఆలోచిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేస్తే , సమంత మాత్రం రాజ్ నిడుమోరు ఒడిలో తలవాల్చి ఆనందంతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనిబట్టి అసలు కథ ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

