హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ పక్కనే ఉన్న టీ దుకాణం యజమాని బాబురావు, తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు ఈ విషయం రాష్ట్రం నలుమూలల తెలిసి బాబురావును భక్తులు అభినందిస్తున్నారు. బాబురావు మాటల్లోనే చెప్పాలంటే తాను గతంలో దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే సమయంలో ఆలయంలో యజ్ఞోపవీతం ఇస్తావా అన్న మాట వినపడిందని, దాంతో స్వామివారి ఆజ్ఞగా, తనకు చెప్పారని భావించి ఈ యజ్ఞోపవీతాన్ని నెల రోజుల్లో చేయించి తెచ్చానని చెప్పారు. ఆ విషయం అలా పక్కన పెడితే అసలు 4.50 కోట్ల విలువైన వజ్రాల వజ్ర ఖచితమైన ఈ బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించిన బాబురావు గతం ఏమిటో తెలుసా..?
నీలోఫర్ టీ దుకాణంలో క్లీనర్ గా చేరాడు.
బాబురావు అదే నీలోఫర్ ఆసుపత్రిలో అదే నీలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరాడు. 1978 సంవత్సరంలో బాబురావు అదిలాబాద్ నుంచి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. టికెట్ లేకుండానే రైల్లో పడుకుని హైదరాబాద్ చేరుకున్న బాబురావు ఒక బట్టల దుకాణంలో పనికి చేరాడు. అయితే అక్కడ కూడా ఆయన్ని 15 రోజులకు తొలగించడంతో నాంపల్లి రైల్వే ప్లాట్ఫారం మీదనే పడుకుంటూ అక్కడే స్నానం చేస్తూ, అక్కడే ఏదో పని చేసుకుంటూ ఉంటే వాడు. ఆ తర్వాత నీలోఫర్ టీ దుకాణంలో క్లీనర్ గా చేరాడు. క్లీనర్ గా చేరిన తర్వాత అతని పనితనం, చురుకుదనం, నిజాయితీ చూసి యజమాని వెయిటర్ గా ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత సూపర్వైజర్ చేశాడు .ఆ తర్వాత టీ మాస్టర్ గారు కూడా అతన్ని ప్రమోట్ చేశాడు. అలా బాబురావు టీ మాస్టర్ గా ఎదిగిన తర్వాత యజమాని తన దుకాణాన్ని బాబురావుకు అప్పగించి ఈ దుకాణంలో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు మాత్రమే అమ్మాలని ఒక షరతు పెట్టి అతనికి అప్పగించేసాడు.
బాబురావు తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు.
అప్పటినుంచి బాబురావుకు అదృష్టం కలిసి వచ్చి ఆ దుకాణాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేశాడు . మూడు బేకరీలు బేకరీలు ,నగరంలో ఇతర చోట్ల నీలోఫర్ టీ స్టాల్స్ నెలకొల్పి కోట్లు గడిచాడు. అయితే బాబురావు తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పటికి కూడా నిలోఫర్ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు అప్పుడప్పుడు వారితో వచ్చే వారికి ఉచిత భోజనం సదుపాయాలు కల్పిస్తుంటాడు. ఎవరైనా చనిపోయినా, వారి బంధువులు స్వగ్రామాలకు మృతదేహాలు తీసుకుపోలేకపోతే వారికి ఆర్థిక సాయం చేస్తుంటాడు. కేఫ్ పక్కనే ఉన్న ఆలయ నిర్వహణ కూడా చూస్తుంటాడు . అదే కాక చాలా వరకు గుప్త దానాలు కూడా చేస్తుంటాడు. బాబురావు తన మూలాలను ఎప్పుడూ మరిచిపోలేదు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

