22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

గ్రీన్ టీ , లెమన్ టీ ,ప్రమాదమే

గ్రీన్ టీ , బ్లాక్ టీ , లెమన్ టీ .. ఇలా రకరకాల టీ లు ఇటీవల కాలంలో వచ్చేసాయి. టీ మరియు కాపీ సేవనంలో కొత్త మార్పులు వచ్చాయి . ఈ మార్పుల్లో జరిగే మేలు ఎంత అన్న విషయం చర్చనీయాంశమే. వీటిలో కార్పొరేట్ల మోసంపై కూడా చర్చ జరుగుతొంది. వీటివల్ల జరిగే ప్రయోజనంకంటే శరీరానికి, ఆరోగ్యానికి జరిగే కీడు ఎంత అని ఆలోచించాల్సిందే. మీరు గ్రీన్ టీలు ,ఎల్లో టీలు, బ్లాక్ టీలు ఇలాంటివన్నీ కూడా కార్పొరేట్ మాయలో నుంచి పుట్టుకొచ్చినవే . కొత్తపేర్లు, ఆకర్షణీమైన ప్యాకింగ్ , అతిశయోక్తులతో దోచుకునే పన్నాగాలే. గ్రీన్ టీ , బ్లాక్ టీ , లెమన్ టీ అయినా, ఏదైనా, టి ఆకును ప్రాసెస్ చేయడం వల్ల జరిగేది. కాకపోతే సగం ప్రాసెస్ చేసిన తేయాకుని గ్రీన్ అంటారు, లేదా బ్లాక్ అంటారు. కొంచెం ఎస్సెన్స్ కలిపితే లెమన్ టీ అంటారు. అంతా వ్యాపార మాయలోకమే.అంతే తప్ప దీనిలో వేరే ప్రత్యేకతలు ఏమీ లేవన్నది స్పష్టమైన సత్యం.

 రంగు ,పేరు ,మార్చి మోసం చేస్తున్నారు

గ్రీన్ టీ ,బ్లాక్ పేరుతొ అన్ని బడా కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడం తప్ప మామూలు టీ పొడి ఒరిజినల్ అయితే మామూలుగా కూడా గ్రీన్ టీ బ్లాక్ టీ ఇవన్నీ కూడా ఒకటే. కాకపోతే సోషల్ మీడియా లేదా ప్రసారమాధ్యమాల పిచ్చిలో ఇలాంటివన్నీ నమ్మి ప్రజలను మభ్య పెట్టి దోచుకోవడం తప్ప వీటి వల్ల ప్రయోజనం లేదు . అనాధికాలంగా తేయాకు నీరు సేవించడంలో ముందుండే చైనా, జపాన్, ఇండియా, శ్రీలంక ఇలా అన్నిదేశాలలో ప్రజలు అనాదికాలంగా టీ తాగుతూనేఉన్నారు. పేరు ఏదైనా టీపొడి ఒకటే.కొత్త రకం వ్యాపారంలో టీబ్యాగ్స్ వచ్చేసాయి. దాని వల్ల ఎంత అనర్థం జరుగుతుందన్న విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోయింది .

ఒక్క టీ బ్యాగ్ లో కోట్ల ప్లాస్టిక్ కణాలు

కెనడాలోని యూనివర్సిటీ చేసిన పరిశోధనలు ఒక ఒక చిన్న టీ బ్యాగ్ వలన ఎంత అనర్థం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ప్లాస్టిక్ పదార్ధం ఉన్న టీబ్యాగ్ ని ఒక్కసారి వేడి నీటిలో ముంచి తీస్తే దానిలో ఒక కోటి పది లక్షల మైక్రోప్లాస్టిక్ కణాలు మరియు 30 కోట్ల నానో ప్లాస్టిక్ కణాలు టీకప్పులోకి చేరిపోతాయి . అత్యంత సూక్ష్మమైన కంటికి కనిపించని ఈ ప్లాస్టిక్ పదార్థాల వల్ల శరీరానికి విపరీతమైన హాని జరుగుతుంది ప్రమాదకరమైన ఆరోగ్యానికి కారణం అవుతాయి అందువల్ల టీ బ్యాగులు వాడే వాళ్ళు కూడా పేపర్ బ్యాగ్స్ లో ఉన్న పేపర్ బ్యాగ్ లో నిలువ చేసిన టీ బ్యాగ్ ను వాడడం ఉత్తమమని చెబుతున్నారు. అన్నిటికంటే డబ్బాల్లో లేదా ప్యాకెట్లు వచ్చే టీపొడి ఉత్తమమని, చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.