22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

గద్దలను పోలిన డ్రోన్లతో రష్యా చెలగాటం

ప్రపంచంలో రెండు అగ్ర దేశాలు, ప్రజాప్రయోజనాలు, అభివృద్ధి విషయం ఎలా ఉన్నా గూడచర్యంలో మాత్రం ఒకదానికొకటి పోటీ పడుతూనే ఉంటాయి. ఈ రెండు దేశాలు అమెరికా మరియు రష్యా. అత్యాధునిక ఆయుధ సంపత్తి తయారీలో నిరంతరం నిమగ్నమై ఉండే ఈ రెండు దేశాలు, గూడచర్యంలో కూడా ఒకదానికొకటి మిన్నగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాయి. ప్పుడు అనేక దేశాలమధ్య రంగంలో డ్రోన్ల శకం ప్రారంభమైంది . భారత్, పాకిస్తాన్, ఇరాన్ , ఇజ్రాయిల్ , మధ్య ఇటీవల డ్రోన్ల యుద్ధమే ప్రధానంగా జరిగింది. మానవ రహిత డ్రోన్లతో బాంబర్లు , క్షిపణులు, ఇలా రకరకాల డ్రోన్లను శత్రుదేశాలు పైకి పంపిస్తున్నారు .

దేశ రక్షణ, శత్రు స్థావరాల అధ్యయనం , సరిహద్దుల్లో పహారా కోసం డ్రోన్లని వినియోగిస్తున్నారు . రష్యా ఇప్పుడు రాబందులను పోలిన డ్రోన్లు , గద్దలను పోలిన డ్రోన్స్ తయారీలో అందె వేసిన చెయ్యిగా చెప్తున్నారు. ఉక్రేనియాపై రష్యా ఎడతెగని దాడులు చేస్తున్న విషయం తెలిసిందే . ఇటీవల ఉక్రేనియాలో ఆకాశంలో గద్దలు అనుమానాస్పదంగా ఎగురుతుండడం గమనించారు. ఒకటి కాదు రెండు కాదు వందలాది గద్దలు ఇలా ఎగురుతుండడం గమనించి చివరకు అవి గద్దలు కాదని , రష్యా పంపిన డ్రోన్ ఈగల్స్ అని గుర్తించారు .

ఈ డ్రోన్ గద్దలు రెక్కలాడించే విధానం , ముక్కు , ఎగిరే విధానం కూడా గద్దలను పోలే ఉంటుంది. అవి కిందకి రావడం , పైకి వెళ్లడం ఇలా అన్ని రకాలుగా గద్దలను నూరు శాతం సరిపోలే విధంగానే ఈ గద్దల డ్రోన్లను తయారుచేసి పంపుతున్నారు. వీటిని రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారు . రిమోట్ కంట్రోల్ లో కూడా ఈ గద్దల మార్గాన్ని నిర్దేశిస్తుంటారు. వీటి ఉనికిని రాడార్లు, ఇతర నిఘా పరికరాలు కనుక్కోవడం కష్టమవుతుంది . వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణం ముసురుకమ్ముకున్న పరిస్థితుల్లోనూ ఈ గద్దలు రాడార్లకు చిక్కడం లేదు. ఈ గద్దల గూఢచారి డోన్లు ఉక్రేనియాకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతున్నాయి.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.