దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కలకలం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత విధానంలో పునర్విభజన జరిగితే దక్షిణాద రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వాదనలు సమంజసంగానే ఉన్నాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు మాత్రం పునర్విభజన ప్రస్తుత విధానం ప్రకారం జరగాల్సిందేనని వాదిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే హిందీ రాష్ట్రాల ప్రాధాన్యం పార్లమెంట్లో గణనీయంగా పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాధాన్యం ప్రస్తుతానికంటే తగ్గుతుంది .
గత 50 ఏళ్లుగా పార్లమెంటులో ఎంపీల సంఖ్య 545 . ఇది మారలేదు. నియోజకవర్గాల సరిహద్దులు మారాయే తప్ప పార్లమెంటు సభ్యుల సంఖ్య మారలేదు. గతంలో ఇందిరాగాంధీ మరియు వాజ్పేయి ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలో నియోజకవర్గాల పునర్విభజన వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు . ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం పార్లమెంటు సభ్యుల సంఖ్య ఎనిమిది వందల నలభై ఐదుకు చేరుతుందని అంచనా వేస్తున్నారు . దీనిలో సింహభాగం ఉత్తరాది రాష్ట్రాలకి తరలిపోనున్నాయి . బిజెపికి చోటు దొరకని తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య పెరకకపోగా వారికి వారి ప్రాధాన్యం పార్లమెంట్లో తగ్గే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ తో సహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది . కాంగ్రెస్ కి గతంలో కానీ ఇప్పుడు గాని పట్టు ఉండే రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా బిజెపికి పట్టు దొరకకుండా ప్రాంతీయ పార్టీల బలంగా ఉన్న రాష్ట్రాలలో పార్లమెంటు సభ్యుల సంఖ్యను అలాగే ఉంచి ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచుకొని బిజెపి భవిష్యత్తులో కూడా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది బిజెపి వ్యూహం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఒకే దఫా 80 పార్లమెంటు స్థానాలు పెరగనున్నాయి . దీన్నిబట్టి బిజెపి కుట్ర అర్థమవుతుంది. ఇలా చేస్తే దేశ రాజకీయ సార్వభౌమ అధికారం మీద సమప్రయోజనాలు అని ఒక సిద్ధాంతం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుందని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగేట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

