ప్రపంచంలో శాస్త్ర ,సాంకేతిక పరిజ్ఞానం ఊహించలేనంతగా అభివృద్ధి చెందిన దేశం జపాన్. జపాన్లో జీవన విధానమేకాదు ,వివిధ రంగాలలో పరిశోధనలు కూడా అందుకోలేనంత వేగంతో అప్రతివతంగా సాగిపోతున్నాయి. గుండుసూది మొదలుకొని అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం వరకు జపాన్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది . జపాన్ అన్ని రంగాలలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ సంప్రదాయం ,ఆచారం, సనాతన ధర్మం, ఆధ్యాత్మికత ఇలాంటి విషయాల్లో జపాన్ ప్రజలది ఒక విభిన్నమైన అభిప్రాయం. జపాన్లో చనిపోయిన తమ బంధువుల కర్మ క్రియల కోసం పూజలు చేసే గురువులు లేదా పూజారులు బాగా తగ్గిపోయారు .
ప్రస్తుతం ఆ వృత్తిని యువతరం చేపట్టడం లేదు. పాత తరంలోనే అది సాంప్రదాయంగా కొనసాగుతుంది. కాలంగడిచేకొద్దీ కాలం చేసే పూజారులతో కర్మ క్రియలు చేసే పూజారులు తగ్గిపోతున్నారు. దీంతో ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జపాన్ శాస్త్రవేత్తలు కర్మ క్రియలు చేసేందుకు ఒక ప్రత్యేకమైన రోబోట్లను తయారు చేశారు. మత గురువుల మాదిరి రోబోట్ లకు దుస్తులు వేసి మంత్ర తంత్రాలు రోబోట్లు ద్వారానే చేయించే మార్గం చూశారు . 2017 నుంచి ఇలాంటి రోబోట్లు తయారు చేస్తున్నారు . అయితే ఈ ఏడాది గతంలో తయారు చేసిన రోబోట్లను మించిన రోబోట్లు తయారు చేశారు . చనిపోయిన వారి పేర్లు, గోత్రనామాలు చెప్పేస్తే ఆ రోబోట్ వారి వంశ చరిత్రను తీసుకొని పకడ్బందీగా కర్మక్రియలు మంత్రం జరిపించే రోబోట్లు వచ్చేశాయి.
అయితే శాస్త్ర సాంకేతిక పరంగా పరిశోధనలలో అగ్రస్థానంలో ఉన్న శాస్త్రవేత్తలు సైతం ఈ రోబోట్లను కర్మ క్రియలకు పడుకోవడం లేదు . రోబోట్లు ద్వారా కర్మక్రియలు చేయడం తమ సనాతన ధర్మానికి, సంప్రదాయానికి విరుద్ధమని ఆ రోబోట్లను జపాన్ ప్రజలు ప్రోత్సహించడం లేదు. గతించిన తమ పితృదేవతల ఆత్మలు శాంతించాలంటే అది మంత్రోచ్ఛారణ ద్వారానే పురోహితుల మంత్రం ద్వారానే జరగాలని వారి అభిలాష . అందుకని ఈ రోబోట్ల వాడకాన్ని జపాన్ శాస్త్రవేత్తలు సైతం వ్యతిరేకిస్తున్నారు. దీంతో కర్మ క్రియలు జరిపించే రోబోట్ ల తయారీ తగ్గిపోయింది . శాస్త్రవేత్తల్లోనూ ఎక్కడో ఒక మూల సాంప్రదాయ మూలాలు, సనాతన ధర్మం , సాంప్రదాయ పద్ధతులు, ఒక విశ్వాసం దాగి ఉంటాయని అనడానికి ఇదే ఉదాహరణ.

