22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

లైసెన్స్ లేని డ్రైవర్లవల్లనే ఎక్కువ ప్రమాదాలు

జాతీయ రహదారులు రక్తం పారిస్తున్నాయి . జాతీయ రహదారుల్లో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది . దేశంలో సగటున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఏడాదికి 1,72,000 . అంటే రోజుకు 474 మంది , మూడు నిమిషాలకి ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు . ఇంత దారుణమైన రోడ్డు ప్రమాదాలు అభివృద్ధి చెందుతున్న మన దేశంలో జరగడం నిజంగా దురదృష్టకరం . అయితే ప్రమాదాల్లో కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే జరిగే ప్రమాదాలు సగానికి పైగా ఉన్నాయి .

లైసెన్స్ లేకుండానే తోలుతున్న డ్రైవర్ల వల్ల 34 వేల మరణాలు

ఈ ప్రమాదాల్లో 13 శాతం ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న డ్రైవర్ల వల్లే జరుగుతున్నాయి . వాహనాలు ఓవర్ లోడింగ్ వల్ల 12 వేల మరణాలు సంభవించాయి .అసలు లైసెన్స్ లేకుండానే తోలుతున్న డ్రైవర్ల వల్ల 34 వేల మరణాలు సంభవించాయి. వీటిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ మరణాలు కూడా ఉన్నాయి . ఇకపోతే బైక్ విషయానికి వస్తే 54 వేల మంది కేవలం హెల్మెట్ లేని కారణంగానే చనిపోయారు . కార్లలో 16 వేలమంది మంది సీట్ బెల్ట్ పెట్టుకోని కారణంగానే చనిపోయారు. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో పదివేల మంది చిన్నారులు ఉన్నారు. ఇది కాక స్కూల్, కాలేజీలకు సమీపంలో మరో 10 వేల మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాలకు బలైపోయారు .

వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలు ..

35వేల మంది రోడ్డు పక్కన నడుస్తున్న వారు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు . వీటన్నిటిలో కనిపించే కారణం ఒకటే. హై స్పీడ్ డ్రైవింగ్ వల్లనే 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు . జాతీయ రహదారుల్లో కూడా హై స్పీడ్ రోడ్లలో కూడా ఓవర్ టేకింగ్, మరియు డ్రైవింగ్ లో నిర్లక్ష్యం, ఎక్కడబడితే అక్కడ ఆపేసే వాహనాలను ఢీకొనడం, రోడ్డుమీద పశువులు కారణంగా , ఇలాంటి వాటి వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి . ఈ ప్రమాదాల్లో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలు 34 వేల వరకు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.