22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

కొన్ని విచిత్రాలను మనం నమ్మలేము . నమ్మకపోయినా అవివిచిత్రాలే . వింత మనస్తత్వాలే. కొద్దీ మందికి మాత్రమే ఉన్న కోరికలాగే ఓ రిటైర్డ్ మిలటరీ అధికారికి ఒక కోరిక కలిగింది. తను చనిపోతే ఎంతమంది తనను చూసేందుకు వస్తారు అని తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. ఎంతమంది తనకు నివాళులర్పిస్తారు ..? తన బంధువుల్లో ఎంతమంది తనను చూసి కన్నీరు పెడతారు ..? చనిపోయాక తన గురించి ఏమనుకుంటారో తెలుసుకోవాలని ఆత్రుత పడ్డాడు. ఆతృత పడడమే తరువాయి ఇంట్లో కొన్ని కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు . జరిగేదంతా మాటలతో సహా రికార్డ్ చేసుకోవాలని ,ఆ తర్వాత చూసుకోవాలనేది అతడి కోరిక .

ఈ విచిత్రమైన కోరిక ఎక్కడిదో కాదు , మన దేశంలోనే జరిగింది . బీహార్ రాష్ట్రంలోని గయలో 74 ఏళ్ల రిటైర్డ్ మిలటరీ అధికారి ఈ విచిత్రమైన సాహసానికి పాల్పడ్డాడు . తాను చనిపోయినట్టు తనే అందరికీ సమాచారాలు పంపించి అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా ముందుగానే చేసుకున్నాడు . ఈ వార్త తెలిస్తే ఎవరు తన గురించి బాధపడతారు, ఎవరు తనను చూసేదానికి వస్తారు, వచ్చినప్పుడు ఏమి తెస్తారు, తనకి ఎలా శ్రద్ధాంజలి ఘటించారు అని చూసుకోవాలని అతని కోరిక . మోహన్లాల్ అనే ఈ రిటైర్డ్ మిలటరీ అధికారి శవపేటికలో పడుకుని తెల్ల గుడ్డ కప్పేసుకున్నాడు . అక్కడి నుంచి సీక్రెట్ గా కొన్ని రంద్రాల ఏర్పాటు చేసుకొని తన అంతిమయాత్ర సాగుతున్నప్పుడు కూడా వీధుల నుంచి పోతున్నప్పుడు ఎవరెవరు తనను చూస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు .

ఆ తర్వాత స్మశాన వాటిక వద్దకు వెళ్ళిన తర్వాత లేచికూర్చున్నాడు. తను చనిపోలేదని తను చనిపోయిన తర్వాత తను చూసేందుకు ఎవరు వస్తారు ఒకసారి చూసుకుందామని ఇలా నాటకం ఆడినని చెప్పాడు . తాను దేశం కోసం జీవితాన్ని అర్పించానని జీవితాంతం సైన్యంలో పనిచేశానని , ఇప్పుడు దేశం కోసం పని చేసిన తనను చూసేందుకు ఎవరు వస్తారో చూసుకోవాలి అన్న కోరిక కలిగిందని ఇది కొంతమందికి విచిత్రము వికృతమే అనిపించినప్పటికీ , తనకు సమంజసం అని మోహన్లాల్ చెబుతున్నాడు . వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంతమందిని బంధువులు మిత్రులు సన్నిహితులు లేదా తన దగ్గర సహాయం పొందిన వారు కూడా మర్చిపోతారని ,కనీసం మృతదేహాన్ని చూసి నివాళులర్పించేందుకు కూడా రారని అలాంటి పరిస్థితులు తనకు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకే ఇలాంటి పని చేశానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.